ఇండోర్, జైపూర్‌కు పోటీనిద్దాం..
వరంగల్ అర్బన్: ‘చేయి చేయి కలుపుదాం.. దేశంలోనే మొదటి స్థానాల్లో నిలిచిన ఇండోర్, జైపూర్ సిటీలకు పోటీనిద్దామని మేయర్ గుండు సుధారాణి విజ్ఞప్తి చేశారు. మంగళవారం వరంగల్ బల్దియా ప్రధాన కార్యాలయం ఆవరణలో బల్దియా, ఆస్కీ సంయుక్త ఆధ్వర్యంలో వలంటీర్లు, శానిటరీ జవాన్లు, ఔత్సాహిక మహిళా సంఘ సభ్యులు, స్వచ్ఛ ఆటోడ్రైవర్లకు తడి పొడి చెత్త సేకరణపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈసందర్భంగా మేయర్ మాట్లాడుతూ.. నగరాన్ని పరిశుభ్రంగా ఉంచేందుకు ‘మన కోసం –మన స్వచ్ఛ వరంగల్‘ నినాదంతో ముందుకెళ్తున్నామన్నారు. ప్రతీ డివిజన్‌కు ముగ్గురు వలంటీర్లను నియమిస్తామని, వీరు 4 నెలల పాటు క్షేత్రస్థాయిలో అవగాహన కల్పిస్తారని తెలిపారు. కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ మాట్లాడుతూ.. ప్రతీ వార్డులోని మూడు స్వచ్ఛ ఆటోలకు ముగ్గురు వలంటీర్లను కేటాయిస్తామని వలంటీర్లు నిబద్ధతతో పని చేయాలన్నారు. ఈసందర్భంగా వలంటీర్లు ధరించే యూనిఫాంను మేయర్, కమిషనర్ ఆవిష్కరించి పొడి చెత్తగా పరిగణించబడే వస్తువులను ప్రదర్శించారు. కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ చంద్రశేఖర్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, డిప్యూటీ కమిషనర్ సమ్మయ్య, ఎంహెచ్‌ఓ రాజేశ్, టీఎంసీ వెంకట్‌రెడ్డి, శానిటరీ సూపర్‌వైజర్లు నరేందర్, గోల్కొండ శ్రీను, శానిటరీ ఇన్‌స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.
మేయర్ గుండు సుధారాణి
‘మన కోసం మన స్వచ్ఛ
వరంగల్’ సదస్సు


