హన్మకొండ అర్బన్: హనుమకొండ జిల్లాలో రెండో విడత నామినేషన్ల ప్రక్రియ మంగళవారంతో ముగిసింది. ఐదు మండలాల్లోని 73 గ్రామపంచాయతీ, 694 వార్డులకు మూడు రోజులుగా అధికారులు నామినేషన్లు స్వీకరించారు. మంగళవారం రాత్రి సుమారు పది గంటల వరకు హసన్‌పర్తి మండలంలోని కొన్ని గ్రామపంచాయతీల్లో నామినేషన్ల స్వీకరణ కార్యక్రమం కొనసాగింది. మొత్తంగా రెండో విడతలో గ్రామపంచాయతీలకు – , వార్డు స్థానాలకు – నామినేషన్లు అందినట్లు అధికారులు తెలిపారు. వీటి స్క్రూటినీ కార్యక్రమం బుధవారం ఉంటుందన్నారు.
మూడో విడత ...
మూడో విడతలో ఆత్మకూరు, దామెర, నడికూడ, శాయంపేట మండలాల్లో బుధవారం నుంచి సర్పంచ్, వార్డు స్థానాలకు నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతున్నట్టు కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. మొత్తం 68 గ్రామపంచాయతీలు, 634 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు. సంబంధిత మండలాల ఎంపీడీఓలు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి పర్యవేక్షించారు.
అర్ధరాత్రి వరకు బారులుదీరిన అభ్యర్థులు
వరంగల్: వరంగల్ జిల్లాలో రెండో విడత కింద దుగ్గొండి, నల్లబెల్లి, సంగెం, గీసుకొండ మండలాల్లోని సర్పంచ్, వార్డు సభ్యుల స్థానాలకు నామినేషన్లు వేసేందుకు అభ్యర్థులు పోటెత్తారు. అర్ధరాత్రి వరకు దాఖలు ప్రక్రియ కొనసాగడంతో ఎన్ని నామినేషన్లు దాఖలైన విషయాన్ని అధికారులు ప్రకటించలేదు. బుధవారంనుంచి మూడో విడతలో నర్సంపేట రెవెన్యూ డివిజన్ పరిధిలోని మొత్తం 109 సర్పంచ్, 946 వార్డు స్థానాలకు నామినేషన్లు స్వీకరించనున్నారు.


