టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ నిర్వహించాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: టీబీ ముక్త్ భారత్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా నిర్దేశించిన మార్గదర్శకాలకు అనుగుణంగా జిల్లాలో టీబీ నియంత్రణకు స్క్రీనింగ్ పరీక్షలు పూర్తి చేయాలని వైద్యారోగ్య శాఖ అధికారులను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లో పట్టణ ఆరోగ్య కేంద్రాలు, ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. టీబీ నియంత్రణ కార్యక్రమాలకు యాక్షన్ ప్లాన్ తయారు చేసుకుని దానికి అనుగుణంగా స్క్రీనింగ్, ఎక్స్ రే, నాట్ పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. స్క్రీనింగ్ పరీక్షలు తక్కువగా నిర్వహించిన వడ్డేపల్లి, లష్కర్ సింగారం, కడిపికొండ ఆరోగ్య కేంద్రాల వైద్యాధికారులను కారణాలు అడిగి తెలుసుకున్నారు. వందశాతం ప్రసవాలను ప్రభుత్వ ఆసుపత్రిలోనే జరగడానికి ప్రోత్సహించిన ఆరుగురు ఆశాలను శాలువాలతో సత్కరించా రు. డీఎంహెచ్‌ఓ అప్పయ్య, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్ మోహన్‌రావు, టీబీ నియంత్రణ అధి కారి డాక్టర్ హిమబిందు,ప్రదీప్‌రెడ్డి, ప్రభుదాస్, జ్ఞానేశ్వర్, అశోక్‌రెడ్డి, ఏఎన్‌ఎంలు పాల్గొన్నారు.


