ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025 | - | Sakshi
Sakshi News home page

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Nov 30 2025 6:41 AM | Updated on Nov 30 2025 6:41 AM

ఆదివా

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

– 8లోu ఆస్తిని ధారపోశారు.. ప్రజల గుండెల్లో నిలిచారు నిస్వార్థ సేవ.. వెలిశాల తోవ 7 పర్యాయాలు.. అనేక సేవలు

తొలి సర్పంచ్‌ కందుకూరి కాంతయ్య

న్యూస్‌రీల్‌

హసన్‌పర్తి: హనుమకొండ మండలం గోపాలపురానికి చెందిన కందుకూరి కాంతయ్య గ్రామానికి తొలి సర్పంచ్‌. 1979 నుంచి 1995 వరకు వరుసగా 17 ఏళ్ల పాటు సర్పంచ్‌గా సేవలందించారు. హనుమకొండ సమితి డిప్యూటీ ప్రెసిడెంట్‌గా, ఏనుమాముల మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌గా, వరంగల్‌ కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌ డైరెక్టర్‌గా పదవులు నిర్వర్తించారు. మాజీ మంత్రి హయగ్రీవాచారికి ముఖ్య అనుచరుడిగా వ్యవహరించారు. 1999లో ఆయన హత్యకు గురయ్యారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామస్తులు పంచాయతీ కార్యాలయం వద్ద కాంతయ్య విగ్రహాన్ని ఆవిష్కరించారు. ఏటా కాంతయ్య వర్ధంతి, జయంతి వేడుకలు నిర్వహిస్తున్నారు. కాంతయ్య స్ఫూర్తితో ఆయన కుటుంబీకులు రాజకీయాల్లో రాణిస్తున్నారు.

దామెర: హనుమకొండ జిల్లా దామెర మండలం కోగిల్వాయికి చెందిన గట్ల మల్లారెడ్డి సేవలు ఇప్పటికీ గ్రామస్తులు గుర్తు చేసుకుంటున్నారు. 1984–90, 1996–2001 రెండు పర్యాయాలు సర్పంచ్‌గా సేవలందించారు. గ్రామంలో ప్రైమరీ, హై స్కూల్‌ నిర్మించారు. పలు గ్రామాల్లో వాటర్‌ ట్యాంకులు, పైపులైన్‌, బస్‌షెల్టర్‌ నిర్మాణం, అంతర్గత రోడ్లు, వీఽధి దీపాల ఏర్పాటు వంటి ఎన్నో వసతులు కల్పించారు. ఆయన సేవలకు గుర్తుగా గ్రామంలోని కూడలిలో మల్లారెడ్డి ప్రతిమను ప్రతిష్ఠించారు. మల్లారెడ్డి కుమారుడు గట్ల విష్ణువర్ధన్‌రెడ్డి అమెరికా నుంచి వచ్చి 2018 నుంచి 2024 వరకు సర్పంచ్‌గా, సర్పంచ్‌ల ఫోరం మండల అధ్యక్షుడిగా సేవలందించారు.

టేకుమట్ల: జయశంకర్‌ భూపాలపల్లి జిల్లా టేకుమట్ల మండలంలోని రామకిష్టాపూర్‌(వి) గ్రామానికి చెందిన లింగంపల్లి మోహన్‌రావు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా ఎన్నికయ్యారు. సొంత ఖర్చులతో రోడ్ల విస్తరణ, సబ్‌స్టేషన్‌ ఏర్పాటు, రోడ్లు, డ్రెయినేజీ, నీటి వసతి ఇలా అనేక సేవలందించారు. సర్పంచ్‌గా కొనసాగుతున్న సమయంలోనే 2009లో మావోయిస్టుల చేతిలో హత్యకు గురయ్యారు. గ్రామస్తుల కోరిక మేరకు గ్రామ పంచాయతీ వద్ద విగ్రహాన్ని ఏర్పాటు చేశారు. ఆయనది వీరమరణమని స్థానికులు చెప్పుకుంటారు.

పాలకుర్తి టౌన్‌: పాలకుర్తి మండలం వావిలాల గ్రామంలో రెండు పర్యాయాలు 1981–1994 వరకు కాంగ్రెస్‌ పార్టీ నుంచి సర్పంచ్‌గా పనిచేసిన గంట సోమయ్య ప్రజలకు విశిష్ట సేవలందించారు. చివరకు తనకున్న ఆస్తినంతా ప్రజా సేవకు ధారపోశారు. అప్పటి ముఖ్యమంత్రి కాసు బ్రహ్మానందరెడ్డిని వావిలాల గ్రామానికి రప్పించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి గ్రామానికి బస్సు సర్వీసులు నడిపించారు. గ్రామంలో 13 నీళ్ల ట్యాంకులు నిర్మించారు. అప్పటి ప్రధాని రాజీవ్‌గాంధీ చేతుల మీదుగా ఉత్తమ సర్పంచ్‌గా పురస్కారం, ప్రశంసపత్రం అందుకున్నారు. గ్రామంలో టెలిఫోన్‌ ఎక్స్ఛేంజ్‌, విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ మంజూరు చేయించారు. 1991 ఆగస్టు 19న సీపీఐ(ఎంఎల్‌) పీపుల్స్‌వార్‌ నాగన్న దళం సర్పంచ్‌ సోమయ్యను కిడ్నాప్‌ చేయడంతో అప్పటి కలెక్టర్‌ బీపీ ఆచార్య చొరవతో నాలుగు రోజుల తర్వాత విడుదలయ్యారు. 2021లో కన్నుమూశారు. గ్రామ ప్రజలు ఆయన సేవలకు గుర్తుగా 2022 ఏప్రిల్‌లో వావిలాల ప్రధాన కూడలిలో విగ్రహం ఏర్పాటు చేసి ప్రతీ ఏటా స్మరించుకుంటున్నారు.

మహబూబాబాద్‌ రూరల్‌: మహబూబాబాద్‌ మండలం రెడ్యాలకు చెందిన వెలిశాల రాధాకృష్ణ 1975 నుంచి 1995 వరకు నాలుగు పర్యాయాలు సర్పంచ్‌గా పనిచేశారు. అనంతరం 2000 నుంచి 2005వ సంవత్సరం వరకు మళ్లీ ఎన్నికై ప్రజలకు సేవలందించారు. గ్రామ అభివృద్ధికి తనవంతు కృషి చేశారు. భూ సమస్యలు, కుటుంబ తగాదాలను పరిష్కరించారు. మృధుస్వభావిగా ఉంటూ అందరి మన్ననలు పొందారు. నిస్వార్థంగా సేవ చేసిన ఆయన 2006 మార్చిలో మృతిచెందారు. పలు పార్టీల నేతలు, గ్రామస్తుల సహకారంతో 2014 జనవరి 27న రాధాకృష్ణ విగ్రహాన్ని గ్రామపంచాయతీ కార్యాలయం ఎదుట ఏర్పాటు చేశారు.

గూడూరు: మండలంలోని పొనుగోడు సర్పంచ్‌గా నూనావత్‌ ధంజ్యానాయక్‌ 7 పర్యాయాలు పనిచేశారు. నిరుపేద గిరిజనులు పోడు భూమి సాగు చేసుకునేలా, మారుమూల ఏజెన్సీ పొనుగోడులో రోడ్లు, బడి, తాగునీటి వసతిపై దృష్టి సారించారు. 1992లో ధంజ్యానాయక్‌ మృతిచెందగా సేవలకు గుర్తుగా గూడూరులోని ప్రధాన బస్టాండ్‌ సెంటర్‌లో ఆయన విగ్రహం ఏర్పాటుచేశారు.

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20251
1/5

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20252
2/5

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20253
3/5

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20254
4/5

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 20255
5/5

ఆదివారం శ్రీ 30 శ్రీ నవంబర్‌ శ్రీ 2025

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement