కేసీఆర్‌తోనే తెలంగాణ వచ్చింది..
శాసనమండలి ప్రతిపక్ష నేత
సిరికొండ మధుసూదనాచారి
హన్మకొండ: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధన కోసం ప్రాణాలకు తెగించి పోరాడిన వీరుడు కేసీఆర్ అని శాసనమండలి ప్రతిపక్ష నేత సిరికొండ మధుసూదనాచారి అన్నారు. శనివారం హనుమకొండలోని కాళోజీ విగ్రహం వద్ద బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లాశాఖ ఆధ్వర్యంలో దీక్షా దివస్ నిర్వహించారు. పార్టీ అధినేత కేసీఆర్ ఫ్లెక్సీకి మధుసూదనాచారి, మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు, బీఆర్‌ఎస్ హనుమకొండ జిల్లా అధ్యక్షుడు దాస్యం వినయ్‌భాస్కర్, మాజీ ఎమ్మెల్యేలు చల్లాధర్మారెడ్డి, వొడితల సతీశ్‌కుమార్, పార్టీ నాయకులు క్షీరాభిషేకం చేశారు. అమరవీరుల స్తూపానికి, కాళోజీ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా సిరికొండ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పాటే లక్ష్యంగా 14ఏళ్లు అకుంఠిత దీక్షతో ఉద్యమాన్ని నడిపిన యోధుడు కేసీఆర్ అన్నారు. రాష్ట్రం అణువణువూ తెలిసి, ప్రజల గోసలను ప్రపంచానికి తెలిపి, స్వరాష్ట్రాన్ని సాధించారన్నారు. మాజీ రాజ్యసభ సభ్యుడు కెప్టెన్ వొడితల లక్ష్మీకాంతారావు మాట్లాడుతూ.. 11 రోజులపాటు ప్రాణాలకు తెగించి, కాంగ్రెస్ ప్రభుత్వ మెడలు వంచి కేసీఆర్ తెలంగాణను సాధించారన్నారు. ప్రస్తుత పాలకులకు రాష్ట్ర ప్రయోజనాలు పట్టడం లేదని విమర్శించారు. మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్ మాట్లాడుతూ.. కేసీఆర్ హయాంలో పాలన వికాసం జరిగితే.. నేడు కాంగ్రెస్ హయాంలో పరిపాలనా విధ్వంసం జరుగుతోందని విమర్శించారు. కార్యక్రమంలో నాయకులు నాగూర్ల వెంకటేశ్వర్లు, లింగంపల్లి కిషన్‌రావు, మర్రి యాదవ రెడ్డి, ఎల్లావుల లలితా యాదవ్, నాయకులు రిజ్వానా మసూద్, పులి రజనీకాంత్, సోదా కిరణ్, బొంగు అశోక్ యాదవ్, చెన్నం మధు, సంకు నర్సింగరావు, బోయినపల్లి రంజిత్‌రావు, ఇమ్మడి లోహితా రాజు, జోరిక రమేశ్, కుసుమ లక్ష్మీనారాయణ, ఉడతల సారంగపాణి, తాళ్లపల్లి జనార్దన్‌గౌడ్, రవీందర్ రావు, నయీముద్దీన్, బండి రజినీకుమార్, హరి రమాదేవి, దూలం వెంకన్న పాల్గొన్నారు.


