గ్రామాభివృద్ధిలో సర్పంచ్ కీలకం
గ్రామాభివృద్ధి – మౌలిక సదుపాయాలపై నిర్ణయాధికారాలు..
ప్రధాన అధికారం..
పరిపాలన, కార్యనిర్వాహక అధికారాలు
● విస్తృత అధికారాలు, బాధ్యతలు
● పాలన వ్యవస్థ మొత్తం
ప్రథమ పౌరుడి చుట్టే..
గ్రామ పారిశుద్ధ్యం, చెత్త తొలగింపు, మురుగు నీటిపారుదల వ్యవస్థల పర్యవేక్షణ.
పరిశుభ్ర నీటి సరఫరా, ట్యాంకులు – పైపులైన్ల నిర్వహణ.
వీధి దీపాల ఏర్పాటు, మరమ్మతు.
అంతర్గత రహదారులు, కాల్వలు, శ్మశానవాటికలు, వైకుంఠధామాల నిర్మాణం –పర్యవేక్షణ.
ప్రభుత్వ స్థలాల్లో సంతలు, మార్కెట్లు, పబ్లిక్ స్థలాల నిర్వహణ నిర్ణయాలు.
సంక్షేమ, ప్రభుత్వ పథకాల
అమలు బాధ్యతలు..
ఉపాధి హామీ పథకం (ఎంజీఎన్‌ఆర్‌ఈజీఎస్ ), పింఛన్లు, గృహ పథకాలు, అంగన్‌వాడీలు, పాఠశాలలు తదితర సంక్షేమ పథకాల అమలుపై పర్యవేక్షణ.
అర్హులైన లబ్ధిదారులను గుర్తించడం, వారికి ప్రయోజనాలు చేకూరేలా చూసుకోవడం.
బలహీన వర్గాలు, మహిళలు, దివ్యాంగులకు సామాజిక భద్రత–సాయం అందేలా చర్యలు.
గ్రామారోగ్యం, పాఠశాలల పనితీరు, అంగన్‌వాడీ సేవల పర్యవేక్షణ.
గ్రామ
ప్రణాళిక–నియంత్రణాధికారాలు..
గ్రామ పంచాయతీ పరిధిలో కొత్త భవన నిర్మాణాలకు అనుమతులు జారీ.
ప్రభుత్వ ఖాళీ స్థలాల వినియోగంపై పంచాయతీకి సలహాలు, అవసరాలకు అనుగుణంగా అవి కేటాయించే చర్యలు.
గ్రామాభివృద్ధి ప్రణాళిక (విలేజ్ డెవలప్‌మెంట్ ప్లానింగ్) తయారీ, అమలు.
పంచాయతీ తీర్మానాలను అమలు చేయడం, పౌరుల భాగస్వామ్యంతో పల్లె ప్రగతి కార్యక్రమాలు
నిర్వహించడం.
హన్మకొండ అర్బన్ : గ్రామపాలనలో స ర్పంచ్ పాత్ర అత్యంత కీలకం. గ్రామ పంచా యతీకి అధిపతిగా, ప్ర భుత్వానికి గ్రామ స్థా యిలో ప్రతినిధిగా, ప్ర జలకు అతి చేరువలో ఉంటూస్థానిక సమస్యల పరిష్కారానికి సర్పంచ్ కృషి చేస్తారు. అభివృద్ధి పనుల రూపకల్పన నుంచి అమలు వరకు.. ప్ర జాసేవల పర్యవేక్షణ నుంచి ప్రభుత్వ పథకాల ప్రవర్తన వరకు మొత్తం గ్రామ పాలన వ్యవస్థ సర్పంచ్ చుట్టూ తిరుగుతుంది. తెలంగాణ పంచాయతీ రాజ్ చట్టం–2018 అమల్లోకి వచ్చిన తర్వాత గ్రామ పంచాయతీలకు మరింత అధికా రం, బాధ్యతలు చేకూరాయి. అవేంటో ఒకసారి తెలుసుకుందాం.
సర్పంచ్ గ్రామ పంచాయతీకి సంపూర్ణ పాలన అధిపతి.
పంచాయతీ సమావేశాలకు అధ్యక్షత వహించడం, ఎజెండా నిర్ణయించడం, తీర్మానాలను అమలు చేయించడం.
గ్రామ సభలను సంవత్సరానికి కనీసం రెండుసార్లు నిర్వహించడం, వాటిలో తీసుకున్న నిర్ణయాలకు చట్టబద్ధత ఇవ్వడం.
పంచాయతీ కార్యదర్శి, సిబ్బంది పని తీరు పర్యవేక్షణ.
గ్రామ పంచాయతీ రికార్డులు, ఆస్తుల జాబితా,
డాక్యుమెంట్ల నిర్వహణ పర్యవేక్షణ.
ప్రభుత్వ చట్టాలు, ఆదేశాలు, పథకాల అమలు
గ్రామస్థాయిలో సక్రమంగా జరిగేలా చర్యలు.
ఆర్థిక, నిధుల నిర్వహణాధికారాలు..
పంచాయతీ బ్యాంకు ఖాతాలపై సంయుక్త సంతకం అధికారం (సర్పంచ్–కార్యదర్శి).
గ్రామ పన్నులు (ఇంటి పన్ను, నీటి పన్ను, వత్తి పన్ను, డ్రైనేజీ పన్ను) విధించడం, వసూలు చేయించడం.
వార్షిక బడ్జెట్ పరిశీలన, ఆమోదం.
అభివృద్ధి పనుల ఖర్చులకు పరిమితి మేరకు
ఆమోదం ఇవ్వడం.
పంచాయతీ ఆర్థిక లావాదేవీలన్నింటిపై పర్యవేక్షణ,
పారదర్శకత కాపాడడం.


