సీకేఎం ఆస్పత్రి సమస్యలు పరిష్కరించాలి
● ఏఐఎఫ్‌డీడబ్ల్యూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రాగసుధ
ఎంజీఎం : సీకేఎం ఆస్పత్రిలో సౌకర్యాల లేమితో గర్భి ణులు అవస్థలు పడుతున్నారని, వెంటనే ఆస్పత్రిలో నె లకొన్న సమస్యలు పరిష్కరించాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సమైక్య (ఏఐఎఫ్‌డీడబ్ల్యూ) రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వంగల రాగసుధ డిమాండ్ చేశారు. ఈ మేరకు జిల్లా కార్యదర్శి కనకం సంధ్య ఆధ్వర్యంలో శుక్రవారం సీకేఎం ఆస్పత్రిని సందర్శించి గర్భిణులు, బాలింతలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆమె మాట్లాడుతూ సీకేఎం 60 నుంచి 100 పడకల ఆస్పత్రిగా అప్‌గేడ్ అయినా వసతుల లేమితో గర్భిణులు, బా లింతలు ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోజుకు 300 నుంచి 400 మంది ఓపీ పేషెంట్స్ వస్తున్నారని, 20 నుంచి 30 డెలివరీలు జరుగుతున్నాయన్నారు. కానీ సిబ్బంది కొరతతో సేవలు అందక రోగుల సంరక్షణ ప్ర మాదంలో పడుతుందన్నారు. వెంటనే ఆస్పత్రిల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం బృందం సభ్యులు గుర్తించిన సమస్యలను ఆస్పత్రి అఽ దికారులకు వివరించారు. ఈక యమున, లలిత, భార తి, మంజుల, కోమల, తదితరులు పాల్గొన్నారు.


