సీఎం సభాస్థలిని పరిశీలించిన ఎమ్మెల్యే
నర్సంపేట: నర్సంపేట నియోజకవర్గ కేంద్రంలో డిసెంబర్ 5వ తేదీన ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి పర్యటన ఖరారైంది. ఈ నేపథ్యంలో శుక్రవారం ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి బహిరంగ సభ కోసం నర్సంపేట మెడికల్ కాలేజీ ఆవరణలోని స్థలాన్ని పరిశీలించారు. అలాగే, మరో రెండు చోట్ల స్థలాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏసీపీ రవీందర్‌రెడ్డి, ఆర్డీఓ ఉమారాణి, మార్కెట్ కమిటీ చైర్మన్ పాల్వాయి శ్రీనివాస్, పీసీసీ సభ్యుడు పెండెం రామానంద్, తదితరులు పాల్గొన్నారు.
నేడు డయల్
యువర్ డీఎం
హన్మకొండ : ప్రయాణికుల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించడానికి ఈ నెల 29న డయల్ యువర్ డీఎం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు ఆర్టీసీ వరంగల్–1 డిపో మేనేజర్ పుప్పాల అర్పిత తెలిపారు. హనుమకొండలోని వరంగల్–1 డిపో నుంచి శనివారం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు డయల్ యువర్ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆమె ఒక ప్రకటనలో వివరించారు. హైదరాబాద్, నిజామాబాద్, సిద్దిపేట, పాలకుర్తి, తరిగొప్పుల తదితర రూట్ల ప్రయాణికులు 9959226047 నంబర్‌కు ఫోన్ చేసి మెరుగైన సేవలు అందించడానికి అవసరమైన సలహాలు, సూచనలు, సమస్యలు వివరించాలని కోరారు.


