వేతనాలు చెల్లించాలని ధర్నా
హన్మకొండ: న్యాయమైన డిమాండ్లు పరిష్కరించాలని నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగులు, డాక్టర్లు నల్ల బ్యాడ్జీలు ధరించి శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ.. రెగ్యులర్ ఉద్యోగులతో సమానంగా పని చేస్తున్న తమపై ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. తమకు ప్రతీ నెల జీతాలు చెల్లించకుండా ఆర్థిక ఇబ్బందుల్లోకి నెడుతోందన్నారు. ఇప్పటి వరకు సెప్టెంబర్, అక్టోబర్ జీతాలు ఇవ్వలేదని, ఇప్పటికై నా ప్రభుత్వం వెంటనే రెండు నెలల వేతనం చెల్లించాలని, ప్రతీ నెల ఒకటో తేదీన జీతాలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని, కాంట్రాక్ట్ పద్ధతిలో పని చేస్తున్న తమను రెగ్యులర్ చేయాలని, ఔట్ సోర్సింగ్‌లో పనిచేస్తున్న ఉద్యోగులను ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని, మహిళా ఉద్యోగులకు వేతనంతో కూడిన 180 రోజుల సెలవులు మంజూరు చేయాలని, ఉద్యోగులకు డిప్యుటేషన్, బదీలీ అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. ధర్నాలో నేషనల్ హెల్త్ మిషన్ ఉద్యోగుల సంఘం జిల్లా నాయకులు ఎండీ రుక్మిద్దీన్, అరుణ్ కుమార్, మహేందర్, సురేశ్, నవీన్‌కుమార్, వినోద్‌కుమార్, రాజేంద్ర ప్రసాద్, అనిత, విజేత, సుష్మ, అనూష, కనిష్క, ప్రవీణ్, సుదర్శన్, వినోద్, నరేశ్, రాకేశ్, రహమాన్, సందీప్ కుమార్, డీపీఎంయూ, పీడీఎంఓస్, డీటీసీఓ, జీఎంహెచ్, మిడ్ వేఫారిస్, ఎస్‌ఎన్‌సీయూ, సీఎల్‌ఎంసీ, టీ హబ్ ఉద్యోగులు, ఎన్‌ఎన్‌ఎంలు పాల్గొన్నారు.
నల్ల బ్యాడ్జీలు ధరించి
ఎన్‌హెచ్‌ఎం ఉద్యోగుల నిరసన


