రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన
న్యూస్‌రీల్
శనివారం శ్రీ 15 శ్రీ నవంబర్ శ్రీ 2025
●
వేయిస్తంభాల ఆలయంలో కార్తీక మాసోత్సవాల్లో భాగంగా శుక్రవారం రుద్రేశ్వరస్వామికి లక్షబిల్వార్చన నిర్వహించారు. వివిధ జిల్లాలకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో దేవాలయాన్ని సందర్శించారు. ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ ఆధ్వర్యంలో వేదపండితులు ఉదయం నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. లక్షబిల్వార్చనకు భక్తుడు చిట్టిరెడ్డి రాంరెడ్డి, లక్ష్మి దంపతులు ఉభయదాతలుగా వ్యవహరించారు.
– హన్మకొండ కల్చరల్
రుద్రేశ్వరస్వామికి లక్ష బిల్వార్చన


