బాలల హక్కులు పరిరక్షించాలి
హన్మకొండ: నేటి బాలలే దేశ భవిష్యత్ అని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ అన్నారు. శుక్రవారం హనుమకొండ కలెక్టరేట్‌లో మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ హెల్ప్‌లైన్, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్, ఎఫ్‌ఎంఎం సాంఘిక సేవా సమితి, డాన్‌బాస్కో నవజీవన్ సంస్థ సమన్వయంతో బాలల దినోత్సవం నిర్వహించారు. హనుమకొండ జిల్లా సంక్షేమ అధికారి జె.జయంతి అధ్యక్షతన జరిగిన సమావేశంలో కలెక్టర్ స్నేహ శబరీష్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ.. బాల్యం అందమైందని, ఆ అనుభూతిని ప్రతీ బాలుడికి, బాలికకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. డీడబ్ల్యూఓ జె.జయంతి మాట్లాడుతూ.. శుక్రవారం నుంచి ఈ నెల 20 వరకు వివిధ కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. బాలల సంరక్షణ కేంద్రం బాల బాలికలకు చిత్రలేఖనం, వ్యాస రచన, వక్తృత్వం, సింగింగ్, డాన్సింగ్‌వంటి పోటీలు నిర్వహించనున్నట్లు వివరించారు. ఈసందర్భంగా ఐసీడీఎస్ హనుమకొండ ప్రాజెక్ట్ పరిధి అంగన్‌వాడీ ప్రీ స్కూల్ చిన్నారులు ప్రదర్శించిన నృత్యం అబ్బురపర్చింది. కలెక్టర్ వారిని అభినందించి బహుమతులు అందించారు. బాలల దినోత్సవాన్ని పురస్కరించుకుని కలెక్టర్ కపోతాలు, బెలూన్లు ఎగురవేశారు. కార్యక్రమంలో చైల్డ్ వెల్ఫేర్ కమిటీ సభ్యులు కజాంపురం దామోదర్ సందసాని రాజేంద్ర ప్ర సాద్, మాజీ చైర్‌పర్సన్ అనితారెడ్డి, సీడీపీఓ ఎం.విశ్వజ, బాల రక్షా భవన్ కో–ఆర్డినేటర్ సీహెచ్ అవంతి, యాంటీ హ్యూమన్ ట్రాఫికింగ్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్యామ్ సుందర్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అ దనపు అధికారి డాక్టర్ టి.మదన్ మోహన్‌రావు, ఆ యా శాఖల అధికారులు, బాధ్యులు డాక్టర్ ఇక్తేదార్ అహ్మద్, అశోక్‌రెడ్డి, ఎస్.ప్రవీణ్‌కుమార్, ఎస్.భాస్కర్, ఎర్ర శ్రీకాంత్, బత్తుల కరుణ, పి.సంతోశ్‌కుమార్, మౌనిక, శ్రీనివాసులు, సునీత, చైతన్య, సుజాత పాల్గొన్నారు.
పిల్లల కోసం రోజులో
15 నిమిషాలు కేటాయించాలి
పేరెంంట్స్ తమ పిల్లల కోసం ప్రతిరోజూ 15 నిమిషాలు కేటాయించి వారి చదువు, తదితర అంశాలను పరిశీలించాలని, వారితో మాట్లాడాలని కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. హనుమకొండ జులైవాడలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జరిగిన పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లో ఆమె పాల్గొన్నారు. తరగతి గదులు పరిశీలించారు. ప్రీ ప్రైమరీ విద్యార్థులతో ముచ్చటించారు. సమావేశంలో ఎంఈఓ నెహ్రూ, హెచ్‌ఎం భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్


