డెయిరీ అనుమతుల ప్రక్రియను పూర్తి చేయాలి
పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి
హన్మకొండ అర్బన్: పరకాల మహిళా డెయిరీ ఏర్పాటుకు సంబంధించి అనుమతుల ప్రక్రియను అధికారులు త్వరగా పూర్తి చేయాలని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో మహిళా డెయిరీ ఏర్పాటుపై హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌తో కలిసి వివిధ శాఖల అధికారులు, మహిళా డెయిరీ నిర్వాహకులతో ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్‌రెడ్డి సమీక్ష నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రేవూరి మాట్లాడుతూ... మహిళా డెయిరీకి పూర్తి స్థాయి బైలాస్‌ను అధికారులు త్వరగా రూపొందించాలన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా ఒక్కో మండలంలో బీఎంసీలను ప్రా రంభిస్తూ మహిళా డెయిరీని విజయవంతంగా నిర్వహించేందుకు ప్రణాళికతో సాగుతున్నట్లు పేర్కొన్నారు. కలెక్టర్ స్నేహ శబరీష్ మాట్లాడుతూ.. రెండురోజుల్లో ప్రస్తుతం సభ్యత్వం ఉన్న 21 మంది ఆధార్ కార్డులు అందజేయాలని, ఫీజుబిలిటీ రిపోర్ట్ త్వరగా అందజేస్తే రిజిస్ట్రేషన్ ప్రక్రియ త్వరగా పూర్తవుతుందన్నారు. సమావేశంలో డీఆర్డీఓ మేన శ్రీను, జిల్లా సహకార అధికారి సంజీవరెడ్డి, ఇతర అధికారులు, మహిళా డెయిరీ సొసైటీ ప్రతినిధులు పాల్గొన్నారు.


