జన్‌జాతీయ గౌరవ్ పక్వాడా
విద్యారణ్యపురి: స్వాతంత్య్ర సమరయోధుడు బిర్సాముండా 150వ జయంతిని పురస్కరించుకుని పాఠశాలల్లో ఈనెల 15వ తేదీ వరకు జన్‌జాతీయ గౌరవ్ పక్వాడా కార్యక్రమం నిర్వహించాలని విద్యాశాఖ ఉన్నతాధికారులు జిల్లా విద్యాశాఖ అధికారులను ఆదేశించారు. దీంతో విద్యాశాఖ అధికారులు పాఠశాలల హెచ్‌ఎంలను ఆదేశించారు. ఈసందర్భంగా ఆదివాసీ సంస్కృతీ, చరిత్ర, సంప్రదాయం, ఆచారాలు, జీవన విధానం తెలియజేయడం, గిరిజనులు, ఆదివాసీల కళాత్మక వారసత్వం గురించి తెలియజేయడం.. సంగీతం, నాటకం, కథల పోటీలను విద్యార్థులను నిర్వహించాల్సి ఉంటుంది. స్థానిక గిరిజన నాయకులను పాఠశాలలకు పిలిపించి వారితో సంస్కృతీ చరిత్రను చెప్పించాల్సి ఉంటుంది.
7వ తేదీన తరగతి గదిలో విద్యార్థులతో గిరిజన ఆదివాసీ సాంస్కృతిక వైవిధ్య విలువలు, ఆచారాలు, ఆహారపు అలవాట్ల గురించి చర్చించాల్సి ఉంటుంది. విద్యార్థులకు వ్యాసరచన పోటీలు నిర్వహిస్తారు.
10న ఆదివాసీ, గిరిజనుల్లో ప్రఖ్యాతిగాంచిన వారిని పాఠశాలలకు పిలిచి వారి విజయగాథలను చెప్పించాల్సి ఉంటుంది. విద్యార్థులతో ప్రఖ్యాతిపొందిన గిరిజన లేదా ఆదివాసీ నాయకుల జీవితాన్ని నాటకం లేదా వీధినాటక రూపంలో ప్రదర్శించాలి.
11న B¨ÐéïÜ, WÇf¯]l {ç³§ýl-Æý‡Ø-¯]l-Ô>-ÌS¯]l$ çÜ…§ýl-Æý‡Ø…^éÍ, Ñ §éÅ-Æý‡$¦-Ë$ ÐéÇ ÐéÆý‡-çÜ-™éÓ-°² {ç³™èlÅ-„ýS…-V> AÐ]l-V>çßæ¯]l MýSÍVóS-Ìê ^èl*yé-ÍÞ-ిÞ E…r$…¨.
గిరిజన వీరుడు బిర్సాముండా జయంతికి
పాఠశాలల్లో వివిధ కార్యక్రమాలు
12న.. కళాకారుల మార్గదర్శనంలో విద్యార్థులతో గిరిజన పాటలు పాడించి నృత్యాలు చేయించాల్సి ఉంటుంది.
13న వంటకాలతో సామూహిక భోజనం.
14న.. విద్యార్థులు చిన్న సమూహాలుగా ఏర్పడి దగ్గరలోని గిరిజన ఆదివాసీ ఆవాసాలను సందర్శించి వారి ఆచారాలు, జీవన విధానం తెలుసుకోవడం.
15న పాఠశాలల్లో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి భగవాన్ బిర్సాముండా చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించి ఎన్‌సీఈఆర్‌టీవారు రూపొందించిన లఘుచిత్రం ప్రదర్శించాల్సి ఉంటుంది. ఈసందర్భంగా బిర్సాముండా జీవిత చరిత్రను తెలియజేయాల్సి ఉంటుంది. స్వాతంత్య్ర సమరంలో వారి పాత్ర ఆదివాసీల హక్కుల గురించి ఎలా పోరాటాలు చేశారో తెలియజేయాల్సి ఉంటుంది. విద్యార్థులు ప్రదర్శనలు ఇవ్వాలని హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓ వెంకటరెడ్డి ఆదేశించారు. ఇతర వివరాల కోసం జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కో–ఆర్డినేటర్ బద్దం సుదర్శన్‌రెడ్డిని 96036 72289లో సంప్రదించాలని సూచించారు.


