శాశ్వత ప్రణాళికలు రూపొందించండి
వరంగల్ అర్బన్: వరంగల్ మహా నగరంలో వరద ముంపు శాశ్వత పరిష్కారానికి ప్రణాళికలు రూపొందించాలని మేయర్ గుండు సుధారాణి ఆదేశించారు. గురువారం బల్దియా ప్రధాన కార్యాలయంలో కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, గ్రేటర్, ఇరిగేషన్ ఇంజనీర్లతో సమావేశమయ్యారు. స్ట్రాంగ్ వాటర్ డ్రెయినేజీ సిస్టమ్, అంతర్గత నాలాలు వరద ప్రభావితంపై పవర్‌పాయింట్ ప్రజెంటేషన్‌ను తిలకించారు. సమావేశంలో బల్దియా ఎస్‌ఈ సత్యనారాయణ, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఈఈలు రవికుమార్, సంతోశ్‌బాబు, డీఈలు రంగారావు, రవికిరణ్, కార్తీక్‌రెడ్డి, రోజారాణి, రాజ్‌కుమార్, ఇరిగేషన్ అధికారులు ఏఈలు పాల్గొన్నారు.
పెండింగ్ పనులు పూర్తి చేయాలి
హనుమకొండ జేఎన్‌ఎస్‌లో బల్దియా చేపట్టిన పెండింగ్ పనులు వెంటనే పూర్తి చేయాలని మేయర్ గుండు సుధారాణి అధికారులను ఆదేశించారు. గురువారం జేఎన్‌ఎస్‌లో ఆర్మీ అగ్నివీర్ ర్యాలీ నేపథ్యంలో మేయర్ స్టేడియంలో కొనసాగుతున్న పనులు తనిఖీ చేశారు. అనంతరం 49వ డివిజన్‌లోని ప్రగతినగర్ రామకృష్ణ కాలనీ తారా గార్డెన్ ప్రాంతాల్లో పర్యటించి ముంపునకు గురవకుండా చర్యలు చేపట్టాలన్నారు. మేయర్ వెంట కార్పొరేటర్ మానస రాంప్రసాద్ ిసీఎంహెచ్‌ఓ డా.రాజారెడ్డి, డీవైఎస్‌ఓ అశోక్, ఆర్మీ మేజర్ గురుదయాళ్ సింగ్, ఈఈలు రవికుమార్ మాధవీలత డీఈలు రాజ్‌కుమార్ కార్తీక్‌రెడ్డి, రాగి శ్రీకాంత్, సారంగం శానిటరీ సూపర్ వైజర్ నరేందర్, ఏఈలు విజయలక్ష్మి, హరికుమార్ తదితరులు పాల్గొన్నారు.
బల్దియా, ఇరిగేషన్ ఇంజినీర్లతో
మేయర్, కమిషనర్ సమీక్ష


