హన్మకొండ కల్చరల్: భద్రకాళి దేవాలయంలో కార్తీకమాసాన్ని పురస్కరించుకుని దేవాదాయశాఖ ఆధ్వర్యంలో దీపోత్సవాన్ని దేవాలయ పరిశీలకులు క్రాంతికుమార్ గురువారం రాత్రి ప్రారంభించారు. సాంస్కృతికోత్సవంలో కూచి పూడి నృత్యాలు, భజనలు అలరించాయి. కార్యక్రమంలో సేవాసమితి సభ్యులు, దేవాలయ సిబ్బంది పాల్గొన్నారు.
విద్యారణ్యపురి: ఉమ్మడి వరంగల్ జిల్లాలో పదోన్నతి పొందిన, గత వేసవిలో శిక్షణకు హాజరు కాని టీచర్లకు గురువారం హనుమకొండలోని వివిధ పాఠశాలల్లో శిక్షణ ప్రారంభమైంది. హనుమకొండలోని ప్రభుత్వ ప్రాక్టీసింగ్ హైస్కూల్‌లో సోషల్ స్టడీస్ స్కూల్ అసిస్టెంట్లకు, లష్కర్‌బజార్ బాలికల ఉన్నత పాఠశాలలో బయాలాజికల్ సైన్స్, ఫిజికల్ సైన్స్, మేథమెటిక్స్ స్కూల్ అసిస్టెంట్లకు శిక్షణ ప్రారంభమైంది. కడిపికొండ హైస్కూల్‌లో ఎల్‌ఎఫ్‌ఎల్‌హెచ్‌ఎంలకు, మడికొండ జెడ్పీహెచ్‌ఎస్‌లోని గెజిటెడ్ హెడ్మాస్టర్లకు శిక్షణ మొదలైంది. టీచర్లకు కెపాసిటీ బిల్డింగ్‌పై, నాయకత్వ లక్షణాలపై అభ్యసనా సామర్థ్యాల పెంపుదల తదితర అంశాలపై శిక్షణ ఇస్తున్నట్లుగా జిల్లా క్వాలిటీ కో–ఆర్డినేటర్ బండారు మన్మోహన్ తెలిపారు. కడిపికొండ జెడ్పీహెచ్‌ఎస్‌లో నిర్వహించిన టీచర్ల శిక్షణలో బండారు మన్మోహన్ మాట్లాడుతూ.. విద్యాబోధనలో నూతన పద్ధతులను అవలంబించి విద్యార్థుల్లో అభ్యసనా సామర్థ్యాలను పెంచేలా కృషి చేయాలన్నారు. ప్రాక్టీసింగ్ స్కూల్‌లో జరుగుతున్న శిక్షణను హనుమకొండ అదనపు కలెక్టర్, ఇన్‌చార్జ్ డీఈఓ వెంకట్‌రెడ్డి పరిశీలించారు.
కాజీపేట అర్బన్/కాళోజీ సెంటర్: హనుమకొండ, వరంగల్ జిల్లాలోని దివ్యాంగులు, దివ్యాంగ సంస్థలకు రాష్ట్రస్థాయిలో పురస్కారాలు అందించేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయా జిల్లాల సీ్త్ర, శిశు సంక్షేమాధికా రులు జయంతి, రాజమణి గురువారం వేర్వేరు ప్రకటనల్లో తెలిపారు. డిసెంబర్ 3వ తేదీ అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం సందర్భంగా రాష్ట్ర స్థాయి పురస్కారాల్ని అందిస్తామని అర్హులైన దివ్యాంగులు ఈనెల 12వ తేదీలోపు దరఖాస్తుల్ని కలెక్టరేట్‌లోని సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ కార్యాలయాల్లో అందజేయాలని, వివరాలకు ఆన్‌లైన్‌లో wdsc.telangana. gov.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
హన్మకొండ కల్చరల్: తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతికశాఖ సౌజన్యంతో చాచా నెహ్రూ జయంతిని పురస్కరించుకుని 9వ తేదీన హ నుమకొండలోని నేరెళ్ల వేణుమాధవ్ కళా ప్రాంగణంలో జేబీ కల్చరల్ ఆర్ట్స్ సొసైటీ వరంగల్ ఆధ్వర్యంలో ఓరుగల్లు చిల్డ్రన్ అవార్డు–2025 బాలల కళల సంబరాల జాతర జరగనుంది. గురువారం జాతర పోస్టర్‌ను ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్య ఆవిష్కరించారు. ఈకార్యక్రమంలో నిర్వహకులు జడల శివ, హరిత, ప్యాడ్ విజయ్, సింగర్ చైతన్య, దాసరి రాజు, శిరబోయిన రాజు, ఆనంద్ పాల్గొన్నారు.
నేడు వందేమాతరం సామూహిక గీతాలాపన
విద్యారణ్యపురి: వందేమాతరం గీతం అమలులోకి వచ్చి 150 ఏళ్లు అయిన సందర్భంగా ఈ నెల 7న ఉదయం 10 గంటలకు పాఠశాలల్లో సామూహిక వందేమాతర గీతాలపన చేయాలని అడిషనల్ కలెక్టర్, హనుమకొండ జిల్లా ఇన్‌చార్జ్ డీఈఓ ఎ.వెంకటరెడ్డి ఆదేశించారు. గురువారం సాయంత్రం హనుమకొండ డీఈఓ కార్యాలయంలో ఎంఈఓలు, జిల్లా సమగ్రశిక్ష సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. టీచర్ల వర్క్ అడ్జెస్ట్‌మెంట్, యూడైస్‌పై సమీక్షించారు.
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం
భద్రకాళి ఆలయంలో దీపోత్సవం


