గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తుల ఆహ్వానం
విద్యారణ్యపురి: హనుమకొండలోని ప్రభుత్వ జిల్లా విద్యా శిక్షణ సంస్థ (డైట్)లో గెస్ట్ లెక్చరర్ల నియామకానికి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు డైట్ ప్రిన్సిపాల్ ఎండీ అబ్దుల్‌హై బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 65 ఏళ్లలోపు వయసు ఉన్న రిటైర్డ్ లెక్చరర్లు, నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కళలు, కళావిద్య సబ్జెక్ట్ పోస్టు కోసం (తెలుగు, ఇంగ్లిష్ మీడియం) ఫైన్ ఆర్ట్స్.. మ్యూజిక్, డాన్స్, థియేటర్ మొదలైన మాస్టర్స్, బ్యాచిలర్స్ బీఎఫ్‌ఏ డిగ్రీ కలిగి ఉండాలని పేర్కొన్నారు. గౌరవ వేతనం నెలకు రూ.15,600, ఫిలాసఫీ/సైకాలజీ, /సోషియాలజీ (ఉర్దూ మీడియం) పోస్టుకు సంబంధిత సబ్జెక్టుల్లో పీజీ ఎంఈడీ విద్యార్హత ఉండాలని తెలిపారు. గౌరవ వేతనం నెలకు రూ 23,400, పెడగజీ ఆఫ్ మేథమెటిక్స్ (ఉర్దూ మీడియం) 1 పోస్ట్ మేథమెటిక్స్ పీజీ ఎంఈడీ విద్యార్హత కలిగి ఉండాలని సూచించారు. గౌరవ వేతనం నెలకు రూ.23,400 చెల్లించనున్నట్లు ఆసక్తి ఉన్న ఆయా అభ్యర్థులు హనుమకొండ ప్రభుత్వ డైట్ కళాశాలలో దరఖాస్తు ఫామ్ తీసుకుని వివరాలను పొందుపర్చి ఒక ఫొటో, విద్యార్హతల ధ్రువీకరణ పత్రాలు జత చేసి ప్రభుత్వ డైట్‌లోనే ఈనెల 7 నుంచి 13వ తేదీ వరకు సమర్పించాలని సూచించారు. ఈనెల 14న తుది జాబితాను (మెరిట్ 1:5) వెల్లడించనున్నట్లు తెలిపారు. ఈనెల 15న డెమో, ఇంటర్వ్యూ లు నిర్వహిస్తామని ఎంపికైన అభ్యర్థుల జాబితాను వెల్లడిస్తామని పేర్కొన్నారు. ఆయా అభ్యర్థులు ఈనెల 17 నుంచి విద్యా బోధన చేయాల్సి ఉంటుందని తెలిపారు.


