నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌ | - | Sakshi
Sakshi News home page

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

Nov 6 2025 11:17 AM | Updated on Nov 6 2025 11:17 AM

నిట్‌

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌ నేడు బీసీ జేఏసీ దీక్ష కబ్జాలు చేసి కాలనీలను ముంచారు.. నేటి నుంచి రైల్వే గేట్‌ మూసివేత వరంగల్‌ మార్కెట్‌ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా మల్లేశం బస్తాలు పెట్టకుండా మార్కింగ్‌

కాజీపేట అర్బన్‌: నిట్‌ వరంగల్‌ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ఆధ్వర్యంలో ఉచిత గేట్‌ కోచింగ్‌ తరగతులు నిర్వహించనున్నట్లు నిట్‌ ఎస్సీ, ఎస్టీ సెల్‌ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. 8 వారాల పాటు అందజేయనున్న ఈకోచింగ్‌ ఈనెల 17వ తేదీన ప్రారంభించి జనవరి 9 వరకు కొనసాగుతుందని పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న అభ్యర్థులు నిట్‌ వెబ్‌సైట్‌లో ఆన్‌లైన్‌లో nitw.ac.inలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.

హన్మకొండ: బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల సాధనకు జరుగుతున్న పోరాటంలో భాగంగా గురువారం నల్ల బ్యాడ్జీలు ధరించి మౌనదీక్ష చేపట్టనున్నట్లు తెలంగాణ స్టేట్‌ బీసీ జేఏసీ ఉమ్మడి వరంగల్‌ జిల్లా చైర్మన్‌ వడ్లకొండ వేణుగోపాల్‌గౌడ్‌ తెలిపారు. హనుమకొండలోని అంబేడ్కర్‌ విగ్రహం వద్ద ఉదయం 11 గంటలకు చేపట్టనున్న దీక్షలో బీసీలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు.

రామన్నపేట: చెరువులు, నాలాలను కాంగ్రెస్‌ నాయకులు కబ్జా చేసి పేదల కాలనీలను నిండా ముంచారని ట్రాన్స్‌జెండర్‌ పుష్పిత విమర్శించారు. బుధవారం వరంగల్‌ రామన్నపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో పుష్పిత మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలకు చీర, గాజులు పంపినట్లు తెలిపారు. ‘మగ ఎమ్మెల్యేలు బయటకు రావడం లేదని చీరలు పంపుతున్నానని తెలిపారు. ‘నేను బయటకు వచ్చి పని చేయడానికి సిద్ధం, ఎమ్మెల్యేలు ఎందుకు రారు’ అని ప్రశ్నించారు. వరంగల్‌ నగరంలో కబ్జాలు పెరిగిపోయాయని, కమీషన్లు తీసుకుని ఎమ్మెల్యేలే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఖమ్మం బ్రిడ్జి స్థలం కబ్జా వెనుక నాయిని, రేవూరి, కొండా సురేఖ, కడియం ఉన్నారని ఆరోపించారు.

కాజీపేట రూరల్‌: కాజీపేట–హసన్‌పర్తి రైల్వే స్టేషన్ల మధ్య ఉన్న కోమటిపల్లి రైల్వే లెవెల్‌ క్రాసింగ్‌ గేట్‌ (నంబర్‌ 02టీ 360/34–36)ను మూసివేస్తున్నట్లు బుధవారం కాజీపేట రైల్వే స్టేషన్‌ మేనేజర్‌ అగ్గి రవీందర్‌ తెలిపారు. అప్‌ అండ్‌ డౌన్‌ రైల్వే ట్రాక్‌ మరమ్మతుల కారణంగా కోమటిపల్లి–దేవన్నపేట గ్రామాలను కలిపే ఈ గేట్‌ను ఈనెల 6వ తేదీ గురువారం ఉదయం 6 గంటల నుంచి 15వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు మూసివేస్తున్నట్లు తెలిపారు. రైల్వే గేట్‌ నుంచి రాకపోకలు సాగించే వాహనదారులు ప్రత్యామ్నాయ మార్గాల మీదుగా రాకపోకలు సాగించి రైల్వే అభివృద్ధికి తోడ్పడాలని స్టేషన్‌ మేనేజర్‌ కోరారు.

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌ కమిటీ ఉన్నత శ్రేణి కార్యదర్శిగా ఆర్‌.మల్లేశంను(ఎఫ్‌ఎసీ) నియమిస్తూ రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్‌ శాఖ కార్యదర్శి కె.సురేంద్రమోహన్‌ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. జమ్మికుంట మార్కెట్‌లో ఉన్నత శ్రేణి కార్యదర్శిగా పని చేస్తున్న మల్లేశంను వరంగల్‌ మార్కెట్‌కు బదిలీ చేశారు. నిజామాబాద్‌ మార్కెట్‌లో గ్రేడ్‌–2 కార్యదర్శిగా పనిచేస్తున్న డి.శ్రీధర్‌ను ఆన్‌డ్యూటీలో నర్సంపేట మార్కెట్‌కు కార్యదర్శిగా నియమించారు. నూతన కార్యదర్శిగా నియమితులైన మల్లేశం శుక్రవారం బాధ్యతలు స్వీకరించనున్నట్లు సమాచారం.

వరంగల్‌: వరంగల్‌ వ్యవసాయ మార్కెట్‌కు తీసుకొచ్చిన పత్తి బస్తాలను యార్డుల్లోని షెడ్ల ఎదుట లాట్లుగా పెడుతున్నారు. షెడ్డుపైకప్పు పైపుల నుంచి మంగళవారం కురిసిన వర్షపు నీరు నేరుగా బస్తాలపై పడడం వల్ల పూర్తిగా తడిసిముద్దయ్యాయి. ఈవిషయం ‘సాక్షి’ పత్రికలో రావడంతో షెడ్లకు ఉన్న పైపులపై రంగు వేశారు. నీళ్లు పడే చోట మార్కింగ్‌ చేశారు. బుధవారం షెడ్‌ నంబర్‌ 4, 8 పక్కన రైతులు పత్తి బస్తాలను వేసుకోకుండా ఈచర్యలు తీసుకున్నట్లు మార్కెట్‌ అధికారులు తెలిపారు. రైతులు ఈ విషయం గమనించి ఎరుపు రంగు గుర్తులు ఉన్న ప్రదేశంలో పత్తి బస్తాలు ఉంచవద్దని కోరారు.

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌1
1/3

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌2
2/3

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌3
3/3

నిట్‌లో ఉచిత గేట్‌ కోచింగ్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement