మరోసారి టీచర్ల సర్దుబాటు | - | Sakshi
Sakshi News home page

మరోసారి టీచర్ల సర్దుబాటు

Nov 6 2025 11:17 AM | Updated on Nov 6 2025 11:17 AM

మరోసా

మరోసారి టీచర్ల సర్దుబాటు

మరోసారి టీచర్ల సర్దుబాటు

విద్యారణ్యపురి: టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియపై రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ తాజాగా జారీచేసిన ఉత్తర్వులతో మరోసారి చేపట్టనున్నారు. విద్యార్థులు తక్కువగా ఉన్న చోట టీచర్లు ఎక్కువ మంది, విద్యార్థులు ఎక్కువమంది ఉన్న చోట టీచర్లు తక్కువ మంది ఉన్న పాఠశాలల్లో టీచర్ల సర్దుబాటు చేయాలనేది అప్పట్లోనే పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ ఆదేశాలు జారీ చేశారు. అందుకు మార్గదర్శకాలను విడుదల చేశారు. తొలుత టీచర్ల పని సర్దుబాటు ప్రక్రియ జరిగిన తర్వాత పదోన్నతుల ప్రక్రియ జరగడంతో మళ్లీ టీచర్ల సర్దుబాటు చేయాల్సి వచ్చింది. అవసరం మేరకు అంటూ ఒక మండలం నుంచి మరో మండలానికి కూడా సర్దుబాటు చేశారు. పలుచోట్ల తమకు అనుకూలంగా ఉండే పాఠశాలలకు సర్దుబాటు చేయించుకుని నిబంధనలు ఉల్లంఘించారన్న ఆరోపణలు వచ్చాయి. సర్దుబాటు జరిగాక కూడా ఇంకా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలను పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ గుర్తించినట్లు సమాచారం

టీచర్ల అవసరం ఉన్న పాఠశాలలు కూడా..

ఏయే జిల్లాల్లో ఎన్ని పాఠశాలల్లో టీచర్ల అవసరం ఉందో జాబితాలను రూపొందించి సర్దుబాటు చేయాలని తాజాగా పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ డీఈఓలను ఆదేశించారు. ఇప్పటికే జరిగిన సర్దుబాటులో లోపాలున్నాయా? అనేది చర్చగా ఉంది. ఇప్పటికే సర్దుబాటు జరిగిన టీచర్లలోనుంచి కూడా అవసరం ఉన్న పాఠశాలలకు సర్దుబాటు చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు. హనుమకొండ జిల్లాలో ఇప్పటికే 158 మంది టీచర్ల వరకు వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేశారు. వరంగల్‌ జిల్లాలో 220 మందిని సర్దుబాటు చేశారు.

హనుమకొండ జిల్లాలో ఈపాఠశాలల్లో

హనుమకొండ జిల్లాలో 20 పాఠశాలల్లో టీచర్ల అవసరం ఉన్నట్లు గుర్తించారు. అందులో భీమదేవరపల్లిమండలం మల్లారం జెడ్పీహెచ్‌ఎస్‌లో 1, వంగర జెడ్పీహెచ్‌ఎస్‌ 1, మల్లంపల్లి ఎంపీపీఎస్‌ 1, ధర్మసాగర్‌ మండలం కాశగూడెం పీఎస్‌ 1, ఎల్కతుర్తి మండలం గోపాల్‌పూర్‌ పీఎస్‌ 1, చింతలపల్లి పీఎస్‌1, బాహుపేట జెడ్పీహెచ్‌ఎస్‌ 1, కేశవపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ 1, హనుమకొండలోని వడ్డేపల్లి పీఎస్‌ ఉర్దూ మీడియం 1, హనుమకొండ ప్రభుత్వ పీఎస్‌ 1, హనుమకొండ ప్రభుత్వ ప్రాక్టీసింగ్‌ ప్రాఽథమిక పాఠశాల 2, ప్రభుత్వ మర్కజీ హైస్కూల్‌ 1, హసన్‌పర్తి మండలం నాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ 2 ఎల్లాపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ 1, హసన్‌పర్తి యూపీఎస్‌ 1 టీచర్ల అవసరం ఉంది. కాజీపేట మడికొండ బీసీ ఎస్సీ కాలనీ పీఎస్‌1, మడికొండ పీఎస్‌ 1, కాజీపేట యూపీఎస్‌ 2, పరకాల మండలం వెల్లంపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ 1, శాయంపేట జెడ్పీహెచ్‌ఎస్‌ 1 టీచర్‌ అవసరం ఉందని జాబితా పంపారు. ఆ పాఠశాలల్లో టీచర్ల అడ్జెస్ట్‌మెంట్‌ చేయాల్సి ఉంటుందని భావిస్తున్నారు.

వరంగల్‌ జిల్లాలోని ఈ పాఠశాలల్లో..

వరంగల్‌ జిల్లాలో 17 పాఠశాలల్లో టీచర్లు ఇంకా అవసరం ఉందని గుర్తించారు. దుగ్గొండి మండలం లక్ష్మీపూర్‌ జెడ్పీహెచ్‌ఎస్‌ 1, ఖిలావరంగల్‌లోని ప్రభుత్వ పీఎస్‌ (మైసయ్యనగర్‌ )1, మామునూరు పీఎస్‌ 1, చింతల్‌ హైస్కూల్‌ 2, నర్సంపేట మండలం రాజుపేట జెడ్పీహెచ్‌ఎస్‌ 1, వల్లభ్‌నగర్‌ ప్రభుత్వ యూపీఎస్‌ 3, నెక్కొండ మండలం నాగారం జెడ్పీహెచ్‌ఎస్‌ 3, సంగెం మండలం కాట్రపల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ 1, తీగరాజుపెల్లి జెడ్పీహెచ్‌ఎస్‌ 1, వరంగల్‌ నగరంలోని శాంతినగర్‌ పీఎస్‌ 1, ప్రతాప్‌నగర్‌ పీఎస్‌1, చార్‌బౌళి జెడ్పీహెచ్‌ఎస్‌ 1, ఇంతేజార్‌గంజ్‌ ప్రభుత్వ హైస్కూల్‌ 1, కృష్ణకాలనీ ప్రభుత్వ హైస్కూల్‌ 1, నరేందర్‌నగర్‌ ప్రభుత్వ హైస్కూల్‌ 1, బాలాజీ నగర్‌ ప్రభుత్వ యూపీఎస్‌లో ముగ్గురు టీచర్ల అవసరం ఉంది. ఆయా పాఠశాలలకు టీచర్ల వర్క్‌ అడ్జెస్ట్‌మెంట్‌ చేయాల్సింటుందని డైరెక్టర్‌ ఆదేశించారు.

రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్‌

నవీన్‌నికోలస్‌ ఆదేశాలు

సర్దుబాటు ప్రక్రియ ముగిసినా టీచర్లు అవసరం ఉన్న పాఠశాలలు గుర్తింపు

పాఠశాల విద్యాశాఖ

డైరెక్టరేట్‌నుంచి జాబితా

మరోసారి టీచర్ల సర్దుబాటు1
1/1

మరోసారి టీచర్ల సర్దుబాటు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement