చెత్తలో రేషన్ బియ్యం
మడికొండ చెత్త డంపింగ్‌యార్డులో గుర్తుతెలియని వ్యక్తులు మంగళవారం అర్ధరాత్రి తర్వాత ప్రజాపంపిణీ (సన్నబియ్యం) బియ్యం బస్తాలు వదిలివెళ్లారు. బుధవారం తెల్లవారుజామున చెత్త, ప్లాస్టిక్ సేకరించేవారు డంపింగ్‌యార్డులోకి వెళ్లగా.. బియ్యం బస్తాలను గమనించి తీసుకెళ్లారు. బస్తాలపై రాష్ట్ర ప్రభుత్వ లోగోతోపాటు బ్యాచ్ నంబర్లు ఉన్నాయి. ఇటీవల కురిసిన వర్షాలకు తడిసిన బస్తాలను ఇక పనికిరావని తీసుకొచ్చి పడేసినట్లు భావిస్తున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్
చెత్తలో రేషన్ బియ్యం


