వరంగల్ కలెక్టర్ సత్యశారద
న్యూశాయంపేట: గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే 163 (జీ)కు సంబంధించిన పెండింగ్ భూ సేకరణ త్వరగా పూర్తి చేయాలని వరంగల్ కలెక్టర్ సత్యశారద ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో గ్రీన్‌ఫీల్డ్ నేషనల్ హైవే పనుల ల్యాండ్ అక్విజేషన్ పురోగతిపై సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మంచిర్యాల–వరంగల్–ఖమ్మం జిల్లాలను కలుపుతూ ఏర్పాటు చేసిన నేషనల్ హైవేలో మొత్తం 176.52 హెక్టార్లకు ఇప్పటివరకు 171.34 హెక్టార్ల ల్యాండ్ అక్విజేషన్ పూర్తయిందని, పెండింగ్ అవార్డును ఈ నెల 10వ తేదీలోపు పూర్తి చేయాలన్నారు. సమావేశంలో అదనపు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్, నర్సంపేట ఆర్డీఓలు సుమ, ఉమారాణి, తహసీల్దార్ శ్రీకాంత్, ఏడీ సర్వే ల్యాండ్ శ్రీనివాస్, అధికారులు పాల్గొన్నారు.
పంట, ఆస్తి నష్టం వివరాలు సమర్పించాలి
ఇటీవల కురిసిన వర్షాలు, వరదలతో జరిగిన పంట, ఆస్తి నష్టం వివరాలు నమోదు చేసి సమర్పించాలని కలెక్టర్ సత్యశారద అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్‌లోని కాన్ఫరెన్స్ హాల్‌లో వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా, మండలాల వారీగా సమగ్ర కార్యాచరణ ప్రణాళికను వారం రోజుల్లోగా రూపొందించాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో అదనవు కలెక్టర్ సంధ్యారాణి, డీఆర్‌ఓ విజయలక్ష్మి, ఆర్డీఓలు సుమ, ఉమారాణి, వ్యవసాయ, ఆర్‌అండ్‌బీ, ఇంజనీరింగ్, పంచాయతీ రాజ్, విద్యుత్, రెవెన్యూ, మున్సిపల్, పశుసంవర్థక అధికారులు పాల్గొన్నారు.


