బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటు చేయాలి
బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: నగరంలో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఎన్‌ఐయూఏ (నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అర్బన్ ఎఫైర్స్) ప్రతినిధులకు సూచించారు. ఎన్‌ఐయూఏ ప్రతినిధులు మంగళవారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో కమిషనర్ మాట్లాడారు. నగరంలో 100 టీపీడీ సామర్థ్యంతో బయో మిథనైజేషన్ ప్లాంట్ ఏర్పాటుకు చెత్త సేకరణ సమాచారం అందజేశామని పేర్కొన్నారు. ఎన్‌ఐయూఏ ప్రతినిధులు నగరంలో పర్యటించి చెత్త సేకరణ విధానాలు, చెత్త తరలింపు పద్ధతులను కూడా అధ్యయనం చేశారని ఆమె వివరించారు. ఈ నేపథ్యంలో ప్లాంట్ ఏర్పాటుకు అవసరమైన సామగ్రి సమకూర్చుకోవాలని కమిషనర్ సూచించారు. ఎస్‌ఈ సత్యనారాయణ, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఎన్‌ఐయూఏ సభ్యులు అనురీత, దీప్తి ప్రతి, రాహుల్ తదితరులు పాల్గొన్నారు.


