ముంపు నివారణకు ముందస్తు చర్యలు
మేయర్ గుండు సుధారాణి
రామన్నపేట: ముంపు నివారణకు ముందస్తు పటిష్ట చర్యలు చేపట్టాలని మేయర్ గుండు సుధారాణి బల్దియా ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్‌తో కలిసి పోతననగర్ వైపు భద్రకాళి చెరువు కట్టను మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా స్థానికంగా ఉన్న నాలా స్థితిగతులు, భద్రకాళి చెరువు కట్ట పరిస్థితిని స్వయంగా పరిశీలించారు. అనంతరం లోతట్టు ప్రాంతాలను నేరుగా పరిశీలించి బాధితులతో మాట్లాడారు. వారిలో ఆత్మస్థైర్యాన్ని పెంపొందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. కార్యక్రమంలో కార్పొరేటర్ దేవరకొండ విజయలక్ష్మి సురేందర్, సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఈఈ రవికుమార్, ఇరిగేషన్ అధికారులు, శానిటరీ సూపర్ వైజర్ గోల్కొండ శ్రీను తదితరులు పాల్గొన్నారు.


