డక్ట్ గేట్లు ఎత్తారు..
హసన్‌పర్తి: కేయూ–వడ్డేపల్లి వంద ఫీట్ల రోడ్డులోని గోపాలపురం చెరువు సమీపంలో ఏర్పాటు చేసిన డక్ట్ గేట్లను అధికారులు ఎత్తారు. ‘డక్ట్ జాలీకి చుట్టుకున్న గుర్రపు డెక్క’, ‘కళ్లకు కట్టిన నిర్లక్ష్యం’ వరుస కథనాలు ‘సాక్షి’లో ప్రచురితమయ్యాయి. ఇందుకు నీటిపారుదలశాఖ అధికారులు స్పందించారు. ఈమేరకు మంగళవారం డక్ట్ గేట్లు ఎత్తివేశారు. దీంతో ఆ ప్రాంతంలో నిల్వ ఉన్న వరద బయటకు వెళ్లిపోయింది. డక్ట్ గేట్ జాలీల్లో గుర్రపు డెక్క, చెత్తాచెదారం కనిపించింది. నాలాల్లో బ్యాక్ వాటర్ పెరిగి కాలనీలు ముంపునకు గురైనట్లు స్పష్టంగా తెలుస్తోంది. అప్పుడే గేట్లు ఎత్తితే నష్టం జరిగి ఉండేది కాదని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. అధికారుల నిర్లక్ష్యమే ఇందుకు కారణమని వారు పేర్కొంటున్నారు.
డక్ట్ గేట్లు ఎత్తారు..


