
కళాక్షేత్రంలో పనులు పూర్తి చేయండి
బల్దియా కమిషనర్, ‘కుడా ’వైస్ చైర్‌పర్సన్
చాహత్ బాజ్‌పాయ్
వరంగల్ అర్బన్: కాళోజీ కళాక్షేత్రంలో పెండింగ్‌లో ఉన్న పనుల్ని త్వరగా పూర్తి చేయాలని బల్దియా కమిషనర్, ‘కుడా’ వైస్ చైర్‌పర్సన్ చాహత్ బాజ్‌పాయ్ అన్నారు. గురువారం కాకతీయ మ్యూజికల్ గార్డెన్‌లో కొనసాగుతున్న అభివృద్ధి పనుల్ని ఆమె పరిశీలించారు. కమిషనర్ వెంట సీపీఓ అజిత్‌రెడ్డి, ఈఈ భీం రావు, అధికారులు పాల్గొన్నారు.
నిబంధనలు పాటిస్తేనే అనుమతులు
నిబంధనలు పాటిస్తేనే నిర్మాణాలకు అనుమతులు, ఆక్యుపెన్సీ సర్టిఫికెట్లు జారీ చేస్తామని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ సూచించారు. గురువారం కమిషనర్ నగర పరిధి ఎక్సైజ్ కాలనీ, శ్రీనివాస కాలనీ, బ్యాంక్ కాలనీ, సాయి గణేశ్ కాలనీ, చింతగట్టు ప్రాంతాల్లో క్షేత్రస్థాయిలో పర్యటించి నమోదు చేసిన వివరాలను కొలతలు వేసి పరిశీలించారు
నిబంధనలు విస్మరిస్తే కూల్చేయండి
భవన నిర్మాణాల్లో నిబంధనలు విస్మరిస్తే కూల్చేయాలని రాష్ట్ర పురపాలక శాఖ కార్యదర్శి శ్రీదేవి సూచించారు. గురువారం హైదరాబాద్ నుంచి ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా.. కమిషనర్, అధికారులు పాల్గొన్నారు.