
బాధితులకు సత్వర న్యాయం అందించాలి
పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్
హసన్‌పర్తి: పోలీస్‌స్టేషన్‌కు వచ్చే బాధితులకు సత్వర న్యాయం అందించాలని పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సూచించారు. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్‌ను గురువారం సీపీ సందర్శించారు. ఈసందర్భంగా పోలీస్‌స్టేషన్ ఆవరణను పరిశీలించి స్టేషన్ పరిఽధిలోని సమస్యాత్మక గ్రామాల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఏయే గ్రామాల నుంచి అధికంగా ఫిర్యాదులు నమోదవుతున్నాయని, నేరాల నియంత్రణకు తీసుకుంటున్న చర్యలను తెలుసుకున్నారు. రౌడీ షీటర్లు, అనుమానిత వ్యక్తుల వివరాలతో పాటు స్టేషన్ అధికారులు, సిబ్బంది నిర్వహిస్తున్న విధుల గురించి తెలుసుకున్నారు. హనుమకొండ–కరీంనగర్ ప్రధాన రహదారిలోని స్టేషన్ పరిధిలో జరుగుతున్న రోడ్డు ప్రమాదాల నివారణ కోసం తీసుకుంటున్న చర్యలపై ఆరా తీశారు. నిజాయితీగా విధులు నిర్వహిస్తూ ప్రజలకు జవాబుదారీగా ఉండాలని సిబ్బందికి సూచించారు. తొలుత సీపీకి పుష్పగుచ్ఛంతో స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాజీపేట ఏసీపీ పశాంత్‌రెడ్డి, స్థానిక పోలీస్ ఇన్‌స్పెక్టర్ చేరాలు, ఎస్సై దేవేందర్, రవి పాల్గొన్నారు.