
డీసీసీ అధ్యక్ష ఎంపికలో నూతన ఒరవడి
ఏఐసీసీ పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్
హన్మకొండ చౌరస్తా: దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్ష పదవుల ఎంపికలో నూతన ఒరవడికి ఏఐసీసీ శ్రీకారం చుట్టిందని ఏఐసీసీ హనుమకొండ, వరంగల్ జిల్లాల పరిశీలకుడు నవజ్యోతి పట్నాయక్ అన్నారు. వరంగల్ పశ్చిమ నియోజకవర్గ ముఖ్య నాయకులతో సోమవారం సమీక్ష నిర్వహించారు. గుజరాత్‌లో రాహుల్‌గాంధీ పైలట్ ప్రాజెక్టుగా ఈకార్యక్రమాన్ని చేపట్టారని, అదే తరహాలో దేశవ్యాప్తంగా డీసీసీ అధ్యక్షుల ఎంపిక ఉంటుందన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, కడియం శ్రీహరి, కేఆర్ నాగరాజు, ఎంపీ కడియం కావ్య, పీసీసీ జిల్లా పరిశీలకులు దుర్గం భాస్కర్, మసూద్, రేణుక, కో–ఆర్డినేటర్ ఆదర్శ్ జైస్వాల్ తదితరులు పాల్గొన్నారు.
క్షేత్ర స్థాయిలో పర్యటన
ఏఐసీసీ అబ్జర్వర్ నవజ్యోతి పట్నాయక్ సోమవారం నగరంలో క్షేత్రస్థాయిలో పర్యటించారు. విపక్ష కార్పొరేటర్లున్న 57వ డివిజన్ హనుమకొండ శ్రీకృష్ణ కాలనీ, 59వ డివిజన్ ఎకై ్సజ్ కాలనీలో డివిజన్ కార్యకర్తలు, స్థానికులతో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. పార్టీ పరిస్థితి, ఇతర వివరాలు తెలుసుకున్నారు. పార్టీని బలోపేతం చేయాలని శ్రేణులకు సూచించారు. సమావేశంలో పీసీసీ నాయకులు అనిల్‌కుమార్, ఈ.వి.శ్రీనివాస్‌రావు, బత్తిని శ్రీనివాస్, మహిళా కాంగ్రెస్ జిల్లా అధ్యక్షురాలు సరళ, కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.