
పౌరుల భాగస్వామ్యమే కీలకం
మేయర్ గుండు సుధారాణి
వరంగల్ అర్బన్: నగర పరిశుభ్రతలో పౌరుల భాగస్వామ్యమే అత్యంత కీలకమని మేయర్ గుండు సుధారాణి అన్నారు. సోమవారం బల్దియా కార్యాలయంలో ఎంఎస్ స్వామినాథన్ రీసెర్చ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌ను మేయర్, కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ తిలకించారు. ఈసందర్భంగా మేయర్ సుధారాణి మాట్లాడుతూ.. బహిరంగంగా నిర్వహించే డంప్‌సైట్‌లతో ఉత్పన్నమయ్యే అంత్య ఉత్పన్నాలను విషపూరిత వాయువులను నిరోధించాల్సిన అవసరం ఉందన్నారు. వ్యర్థాల నిర్వహణకు వరంగల్ ఒక బెంచ్‌మార్క్ నగరంగా అవతరించడానికి అవకాశం ఉందని పేర్కొన్నారు. నగరంలో పర్యావరణ పరిరక్షణతో పాటు పౌరుల ఆరోగ్యం ఘన వ్యర్థాల నిర్వహణను బలోపేతం చేయడానికి ప్రముఖ జాతీయ పరిశోధన విధాన సంస్థల సహకారం తీసుకోనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో సీఎంహెచ్‌ఓ డాక్టర్ రాజారెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, ఇన్‌చార్జ్ సిటీప్లానర్ రవీందర్ రాడేకర్, ఎంహెచ్‌ఓ డాక్టర్ రాజేశ్, ఏసీపీలు ఖలీల్, ప్రశాంత్, రజిత, శ్రీనివాస్‌రెడ్డి, ఈఈలు రవికుమార్, మహేందర్, సంతోశ్‌బాబు, ప్రిన్సిపల్, సైంటిస్ట్ డా.ప్రతిభ గణేశన్ తదితరులు పాల్గొన్నారు.