
భూ పరిహారం డిపాజిట్ చేయాలి
హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే కోసం భూ సేకరణ పూర్తయిన రైతులకు పరిహారం చెల్లించాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ జాతీయ రహదారుల శాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్‌లోజాతీయ రహదా రుల శాఖ, వరంగల్ ప్రాజెక్టు డైరెక్టర్ కీర్తి భరద్వా జ్, అధికారులతో ఆమె సమావేశమయ్యారు. పరకాల డివిజన్ పరిధిలో సేకరించిన భూములకు సంబంధించిన అంశాలపై చర్చించారు. ఆర్బిట్రేషన్ ఆర్డర్స్ ఇచ్చినప్పటికీ ఇంకా ఆయా మండలాల పరిధి 10 గ్రామాలకు చెందిన 110 కేసుల్లో మొత్తం పరిహారం రూ.7.52కోట్లు, బావులు, చెట్లు, స్ట్రక్చర్‌కు సంబంధించి రూ.6.50 కోట్లు రావాల్సి ఉండగా వీటిపై కలెక్టర్ సమీక్షించారు. కాగా, పరిహారం పొందిన తర్వాత కూడా కొందరు రైతులు భూమి మోకాపై ఉండి పంటలు వేసుకున్నారని, ఆభూముల్ని జాతీయ రహదారుల శాఖకు అప్పగించాలని ఎన్‌హెచ్ పీడీ కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు.
రూ.15 లక్షలతో కటాక్షపూర్
కాజ్ వే నిర్మాణం
వరంగల్–ములుగు ప్రధాన రహదారిలో ఉన్న కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణ పనుల్ని రూ.15 లక్షల వ్యయంతో చేపట్టనున్నట్లు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ కటాక్షపూర్ కాజ్ వే నిర్మాణానికి సంబంధించి సాగునీటి పారుదల, జాతీయ రహదారుల శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఆయా సమావేశాల్లో అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, సూపరింటెండెంట్ జగత్‌సింగ్, హనుమకొండ ఆర్డీఓ రాథోడ్ రమేశ్, జాతీయ రహదారుల శాఖ డీఈ కిరణ్‌కుమార్, ఏఈ చేతన్, సాగునీటిపారుదల శాఖ డీఈ సునీత, ఏఈ వేణుగోపాల్, అధికారులున్నారు.
పోస్టర్ ఆవిష్కరణ
‘సే నో టు డ్రగ్స్’లో భాగంగా డ్రగ్స్ వినియోగం వల్ల ప్రమాదాలు, నిర్మూలనకు సంబంధించి చేపట్టే పలు అవగాహన కార్యక్రమాలకు సంబంధించిన వాల్‌పోస్టర్‌ను హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సోమవారం ఆవిష్కరించారు. కార్యక్రమంలో డీఆర్డీఓ మేన శ్రీను, సీపీఓ సత్యనారాయణ, డీడబ్ల్యూఓ జయంతి, డీపీఆర్‌ఓ, ఎఫ్‌ఆర్‌ఓ, కమ్యూనిటీ ఎడ్యుకేటర్, సిబ్బంది పాల్గొన్నారు.