కనీస వసతులు కల్పించండి | - | Sakshi
Sakshi News home page

కనీస వసతులు కల్పించండి

Oct 14 2025 7:31 AM | Updated on Oct 14 2025 7:31 AM

కనీస వసతులు కల్పించండి

కనీస వసతులు కల్పించండి

కనీస వసతులు కల్పించండి

వరంగల్‌ అర్బన్‌: కాలనీల్లో మౌలిక వసతులు కల్పించాలని, నగర వ్యాప్తంగా పలు కాలనీల వాసులు గ్రేటర్‌ వరంగల్‌ కమిషనర్‌ చాహత్‌ బాజ్‌పాయ్‌కి విజ్ఞప్తి చేశారు. సోమవారం బల్దియా ప్రధాన కార్యాలయంలో జరిగిన గ్రీవెన్స్‌ సెల్‌లో కమిషనర్‌ దరఖాస్తులు స్వీకరించారు. ఈసందర్భంగా కమిషనర్‌ మాట్లాడుతూ.. ప్రజలు అందించిన ఫిర్యాదులకు జవాబుదారీగా సమస్యలు పరిష్కరించాలని ఆదేశించారు. కాగా, గ్రీవెన్స్‌కు మొత్తం 70 ఫిర్యాదులు అందాయి. కార్యక్రమంలో అడిషనల్‌ కమిషనర్‌ చంద్రశేఖర్‌, సీఎంహెచ్‌ఓ డాక్టర్‌ రాజారెడ్డి, ఎస్‌ఈ సత్యనారాయణ, సీహెచ్‌ఓ రమేశ్‌, ఇన్‌చార్జ్‌ సిటీ ప్లానర్‌ రవీందర్‌ రాడేకర్‌, డిప్యూటీ కమిషనర్‌ ప్రసన్నరాణి, పన్నుల అధికారి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

ఫిర్యాదుల్లో కొన్ని..

● కీర్తినగర్‌లో 45–9–127 డ్రెయినేజీ నిర్మాణం చేపట్టాలని వి.లలిత ఫిర్యాదు చేశారు.

● హనుమకొండ మున్నూరుకాపు కాలనీ 7–7–336 ప్రాంతంలో సీసీ రోడ్డు, డ్రెయినేజీ, నల్లా పైప్‌లైన్లు ఏర్పాటు చేయాలని కాలనీవా సులు కోరారు.

● 15వ డివిజన్‌ గొర్రెకుంటలో రోడ్డు మధ్యలో ప్రమాదకర విద్యుత్‌ స్తంభాలను తొలగించాలని ఎస్‌.రవి విన్నవించారు.

● 2వ డివిజన్‌ రెడ్డిపురంలో డ్రెయినేజీ నిర్మించాలని పి.ముంజుల కోరారు.

● 35వ డివిజన్‌ పుప్పాలగుట్టలో సీసీ రోడ్లు నిర్మించాలని లక్ష్మీగణపతి కాలనీవాసులు కోరారు.

● హనుమకొండ మాదిరెడ్డి కాలనీ 3–9–205 సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని డిప్యూటీ తహసీల్దార్‌ విజయ శ్రీ వినతి పత్రం అందించారు.

● హనుమకొండ అడ్వకేట్స్‌ కాలనీ న్యూ స్వరాజ్యలక్ష్మి రెసిడెన్సీలో సీసీ రోడ్డు నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● హనుమకొండ పోస్టల్‌ కాలనీలో 40 ఫీట్ల రోడ్డు ఆక్రమణకు గురవుతోందని చర్యలు తీసుకోవాలని దరఖాస్తు అందజేశారు.

● 55వ డివిజన్‌ నేచర్‌ కాలనీలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారిందని, నూతనంగా నిర్మించా లని వెల్ఫేర్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

● హనుమకొండ రామారంలోని సహ వికాస కాలనీలో డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు వినతి పత్రం సమర్పించారు.

● 1వ డివిజన్‌ ఎర్రగట్టు గుట్ట శ్రీనివాస కాలనీరోడ్డు–2లో సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● 4వ డివిజన్‌ యాదవనగర్‌ జంక్షన్‌ నుంచి 900 మీటర్ల సీసీ రోడ్డు, డ్రెయినేజీ నిర్మించాలని రెడ్డిపురం రోడ్డు కాలనీల అభివృద్ధి కమిటీ ప్రతినిధులు కోరారు.

● 1వ డివిజన్‌ ఎర్రగగట్టు గుట్ట బాలాజీనగర్‌ రోడ్లు, డ్రెయినేజీ నిర్మాణాలు చేపట్టాలని కాలనీ అభివృద్ధి నిర్వహకులు విజ్ఞఫ్తి చేశారు.

● వంగపహాడ్‌లో కమ్యూనిటీ హాల్‌, లైబ్రరీ ఏర్పాటు చేయాలని రైసింగ్‌ స్టార్స్‌ యూత్‌ అసోసియేషన్‌ ప్రతినిధులు కోరారు.

● మడికొండ నెహ్రూనగర్‌ 30–2–727 రోడ్డును ప్లాట్లుగా చేసి విక్రస్తున్నారని చర్యలు తీసుకోవాలని ఎం.శ్రీనివాస్‌ విన్నవించారు.

● 32వ డివిజన్‌ క్రిస్టియన్‌ హాస్పిటల్‌ వెనుక సుమారు 154 కుటుంబాలకు చెందిన మట్టి రోడ్డుతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని సీసీ రోడ్డు నిర్మించాలని కోరారు.

● హనుమకొండ రెవెన్యూ కాలనీలో 80 ఫీట్ల రోడ్డు ఆక్రమణలను తొలగించి, అభివృద్ధి చేయాలని కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.

● 2వ డివిజన్‌ వంగపహాడ్‌ రింగ్‌ రోడ్డు ప్రభుత్వ భూమిని కబ్జా చేసి ప్లాట్లుగా చేసి విక్రయిస్తున్నారని స్థానికులు ఫిర్యాదు చేశారు.

గ్రేటర్‌ గ్రీవెన్స్‌లో అర్జీదారుల మొర

ప్రజల నుంచి 70 ఫిర్యాదులు

తక్షణమే పరిష్కరించాలని

అధికారులకు గ్రేటర్‌ కమిషనర్‌ ఆదేశం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement