
గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగి మృతి
కాజీపేట రూరల్: హైదరాబాద్ నుంచి విశాఖపట్టణం వెళ్లే గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో బుధవారం రాత్రి హైదరాబాద్ జీహెచ్‌ఎంసీ ఔట్‌సోర్సింగ్ ఉద్యోగి మృతి చెందాడు. ఈ ఘటనతో రైల్వే అధికారులు గోదావరి ఎక్స్‌ప్రెస్‌ను కాజీపేటలో 52 నిమిషాల పాటు నిలిపివేశారు. కాజీపేట జీఆర్పీ హెడ్‌కానిస్టేబుల్ వెంకటయ్య, రైల్వే అధికారులు తెలిపిన వివరాల ప్రకారం.. హనుమకొండ జిల్లా గోపాలపురం వెంకటేశ్వరకాలనీకి చెందిన మారెపల్లి సుజిత్ (45) గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ (జీహెచ్‌ఎంసీ)లో ఔట్ సోర్సింగ్ ఎంప్లాయ్‌గా పనిచేస్తున్నాడు. ఆయన నాంపల్లి స్టేషన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ ఎస్–2 కోచ్‌లో ఎక్కి టాయిలెట్ వెళ్లాడు. హనుమకొండకు చెందిన తోటి ఉద్యోగులు సుజిత్ కనిపించకపోవడంతో ఫోన్ చేస్తూ అటు ఇటు వెతికారు. ఎంతకు కనిపించకపోవడంతో అనుమానం వచ్చి లాక్ అయి ఉన్న టాయిలెట్ డోర్‌ను తెరిచి చూడగా అందులో పడి ఉన్నాడు. రైల్వే డాక్టర్ వచ్చి చూడగా అప్పటికే సుజిత్ మృతి చెందినట్లు చెప్పారు. సుజిత్ గుండెపోటుతో మరణించి ఉంటాడని ప్రయాణికులు అంటున్నారు. పోలీసులు కుటుంబ సభ్యులకు సమాచారం ఇవ్వగా స్టేషన్‌కు చేరుకున్నారు. రైలులో నుంచి మృతదేహాన్ని కిందికి దింపి పోస్టుమార్టం నిమిత్తం వరంగల్ ఎంజీఎం మార్చురీ తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ తెలిపారు. కాగా, ఈ ఘటనతో కాజీపేట జంక్షన్‌కు రాత్రి 7:43 గంటలకు చేరుకున్న గోదావరి ఎక్స్‌ప్రెస్ 8:35 గంటలకు విశాఖపట్టణం బయలుదేరి వెళ్లిందని రైల్వే అధికారులు తెలిపారు.
ఆలస్యంపై ప్రయాణికుల ఆందోళన
కాజీపేట జంక్షన్‌లో గోదావరి ఎక్స్‌ప్రెస్ సుమారు గంటపాటు ఆగడంతో ప్రయాణికులు ఆందోళన చెందారు. వివిధ ప్రాంతాలకు వెళ్లే వారు ఏమైందని ఆరా తీశారు.
కాజీపేటలో 52 నిమిషాలు
రైలు నిలిపివేత

గోదావరి ఎక్స్‌ప్రెస్‌లో ఉద్యోగి మృతి