
తెగులు.. దిగులు
దుంప తొలుచు ఈగ..
దుగ్గొండి: పసుపు.. పచ్చ బంగారం. రైతులకు సిరులు కురిపించే పంట. అయితే కొన్ని సంవత్సరాలు గా గిట్టుబాటు కావడం లేదు. మద్దతు ధర లేకపోవడం, దిగుబడి రాకపోవడంతో అన్నదాతలు నష్టా ల పాలవుతున్నారు. గతేడాది వరంగల్ జిల్లా వ్యాప్త ంగా 9 వేల ఎకరాలలో పసుపు పంట సాగుకాగా ఈ సారి 6 వేల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ క్రమంలో విస్తీర్ణం తగ్గిన కారణంగా పసుపుకు అధి క ధర దక్కే అవకాశం ఉందని, రైతులు పంటను జాగ్రత్తగా కాపాడుకోవాలని జిల్లా ఉద్యానశాఖ అధికారి శ్రీనివాసరావు సూచించారు. అధిక వర్షాల కారణంగా పసుపులో తాటాకు తెగులు, ఆకుమచ్చ, దుంప పుచ్చు, దుంప ఈగ తెగుళ్లు ఆశించాయని, వెంటనే అన్నదాతలు నివారణ చర్యలు చేపట్టాలన్నారు. పసుపు పంటకు అక్టోబర్, నవంబర్, డిసెంబర్ నెలలు అత్యంత కీలకమని ఆయన తెలిపారు.
ఈగ పిల్ల పురుగులు తెల్లరంగులో బియ్యం గింజల మాదిరి ఉండి భూమి లోపల ఉన్న దుంపల్లోకి చొచ్చుకుని వెళ్లి దుంపను తిని నాశనం చేస్తాయి. ఈ పురుగు వల్ల సుడి ఆకు దాని దగ్గరలో ఉండే లేత ఆకులు వాడి గోధుమ రంగుగామారి ఎండి రాలుతాయి. మువ్వను పీకితే సులభంగా ఊడి వస్తుంది.
నివారణ..
ఈ పురుగు లక్షణాలు కనిపిస్తే ఎకరాకు 100 కిలోల వేపపిండిని మొక్కల మొదళ్ల వద్ద వేయాలి. వేప పిండి వేయడానికి వీలుకాకపోతే 10 కిలోల కార్బోఫ్యూరాన్ గుళికలను 10 కిలోల ఇసుకలో కలిపి ఎకరం భూమిలో సమంగా చల్లాలి.
పసుపు పంటకు
మూడు నెలలు కీలకం..
ఆకుమచ్చ, దుంపకుళ్లుతో
పంటకు తీవ్ర నష్టం
జాగ్రత్తగా ఉండాలి
రైతులకు వరంగల్ జిల్లా ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసరావు సలహాలు

తెగులు.. దిగులు

తెగులు.. దిగులు

తెగులు.. దిగులు

తెగులు.. దిగులు