
హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలి
● జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్
టాంజిన్ డైకిడ్
ఎంజీఎం: కౌమార దశ నుంచే విద్యార్థులకు హెచ్‌ఐవీపై అవగాహన ఉండాలని జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్ సూచించారు. జాతీయ స్ట్రాటజిక్ ఇన్ఫర్మేషన్ కన్సల్టెంట్ రాజీవ్‌తివారీతో కలిసి హనుమకొండ, వరంగల్ జిల్లాల్లో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను పరిశీలించారు. ముందుగా కడిపికొండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో విద్యార్థులతో సమావేశమై మాట్లాడుతూ హెచ్‌ఐవీ బాధితులపై వివక్ష చూపకూడదని పేర్కొన్నారు. అనంతరం కడిపికొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని సందర్శించి హెచ్‌ఐవీ టెస్టులు, గర్భిణులకు పరీక్షలు, కౌన్సెలింగ్‌ను పరిశీలించారు. హనుమకొండ టీబీ ఆస్పత్రిలోని సంపూర్ణ సురక్ష కేంద్రాన్ని సందర్శించారు. ఎంజీఎం ఆస్పత్రిలోని ఏఆర్‌టీ సెంటర్, ఐసీటీసీ, హెచ్‌ఐవీ వైరల్ లోడ్ టెస్టింగ్ ల్యాబోరేటరీ, కౌన్సెలింగ్ కేంద్రాన్ని పరిశీలించారు. జాతీయ ఎయిడ్స్ నియంత్రణ సంస్థ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ టాంజిన్ డైకిడ్, బృందం సభ్యులు హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. హనుమకొండ, వరంగల్ డీఎంహెచ్‌ఓలు అల్లెం అప్పయ్య, సాంబశివరావు, ఎంజీఎం సూపరింటెండెంట్ కిశోర్‌కుమార్, అడిషనల్ డీఎంహెచ్‌ఓ మదన్మోహన్‌రావు, రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ జాయింట్ డైరెక్టర్లు రవికుమార్, శిల్ప, టి.అనురాధ, కె.ప్రసాద్, రమేష్, మధుసూదన్, డీడీ ల్యాబ్ సర్వీసెస్ హరిత, ఏఆర్‌టీ సెంటర్ వైద్యులు సీహెచ్ సూర్యప్రకాశ్, రాంమనోహర్‌రావు, ప్రోగ్రాం అధికారి మోహన్‌సింగ్, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ మేనేజర్ స్వప్న మాధురి, జిల్లా మాస్‌మీడియా అధికారి అశోక్‌రెడ్డి, రామకృష్ణ, కమలాకర్, ట్రాన్స్‌జెండర్స్ రాష్ట్ర అధ్యక్షులు లైలా, ఇక్బాల్ పాషా పాల్గొన్నారు.