
మ్యూజియం పనులు పూర్తిచేస్తాం
● రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్
కె.అర్జున్‌రావు
ఖిలా వరంగల్: మ్యూజియం అభివృద్ధి పనులను పూర్తి చేస్తామని రాష్ట్ర పురావస్తుశాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.అర్జున్‌రావు తెలిపారు. మంగళవారం ఖిలా వరంగల్‌కోటను రాష్ట్ర పురావస్తుశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజు, అడిషనల్ డైరెక్టర్ బుజ్జి, పర్యాటక శాఖ జిల్లా అధికారి శివాజీతో కలిసి ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా శిల్పాల ప్రాంగణంలోని శిల్పసంపదను తిలకించారు. అనంతరం నిర్మాణంలోని మ్యూజియం భవనాన్ని సందర్శించి మాట్లాడారు. దీర్ఘకాలిక కొనసాగుతున్న మ్యూజియం అభివృద్ధి పనులు పూర్తిచేసి పర్యాటకులు, జిల్లా వాసులకు అందుబాటులోకి తెస్తామని తెలిపారు. భక్తులు, పర్యాటకులకు చరిత్ర తెలిసేలా సైన్ బోర్డులు, వివరణాత్మక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఆదేవిధంగా ఆలయ గోడలపై ఉన్న వైట్‌వాష్‌ను రసాయనాలతో శుద్ధి (కెమికల్ క్లీనింగ్) చేయాలని సూచించాచారు. అంతకుముందు స్వయంభూ దేవాలయంలోని శంభులింగేశ్వరుడిని దర్శించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి శంభులింగం పూర్ణకుంభంతో ఆయనను స్వాగతించారు. కార్యక్రమంలో కోట గైడ్ రవియాదవ్, సౌండ్ అండ్ లైటింగ్ షో ఇన్‌చార్జ్ అజయ్, సిబ్బంది పాల్గొన్నారు.