
కాంగ్రెస్ మోసాలను ఎండగట్టాలి
హసన్‌పర్తి : కాంగ్రెస్ పార్టీ మోసాలను ఎండగట్టాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు పిలుపునిచ్చారు. శుక్రవారం హసన్‌పర్తి మండలంలోని జయగిరి గ్రామంలో కాంగ్రెస్ బాకీ కార్డులు పంపిణీ చేయగా దయాకర్‌రావు ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్ల కోసం వచ్చే కాంగ్రెస్ నాయకులను హామీల అమలుపై ప్రశ్నించాలని, బాకీ కార్డులు చూపించాలని పిలుపునిచ్చారు. వృద్ధులకు రూ.4వేలు పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పటీ వరకు నెరవేర్చలేదని మండిపడ్డారు. బీఆర్‌ఎస్ నాయకులు బండి రజనీకుమార్, పావుశెట్టి శ్రీధర్, విక్టర్‌బాబు, భగవాన్‌రెడ్డి, జట్టి రాజేందర్, రాణి, అశోక్, రాజు తదితరులు పాల్గొన్నారు.