తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడుకలు షురూ | - | Sakshi
Sakshi News home page

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడుకలు షురూ

Sep 21 2025 1:04 AM | Updated on Sep 21 2025 1:04 AM

తెలంగ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ

ఐక్యత స్ఫూర్తిని చాటేలా

సంబురాలు..

మహిళలకు బతుకమ్మ పండుగ శుభాకాంక్షలు. ఐక్యత స్ఫూర్తిని చాటేలా సబ్బండ వర్గాలు బతుకమ్మ సంబురాలు జరుపుకోవాలి. తొమ్మిదిరోజులపాటు జరగనున్న ఉత్సవాలను ఘనంగా నిర్వహించుకునేందుకు అన్ని ఏర్పాట్లు చేశాం. రాష్ట్రప్రభుత్వం నిర్వహించనున్న బతుకమ్మ వేడుకలు వేయిస్తంభాల దేవాలయం నుంచి ప్రారంభమవుతాయి.

–కొండా సురేఖ, దేవాదాయశాఖ మంత్రి

మహిళలు సంతోషంగా

జరుపుకోవాలి

దేవాదాయశాఖ పరిధిలోని దేవాలయాల్లో బతుకమ్మ ఆడుకోవడానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశాం. మొదటిరోజు నుంచి తొమ్మిదవ రోజు సద్దుల బతుకమ్మ వరకు మహిళలు సంతోషంగా జరుపుకోవాలి. అమ్మవారి దీవెనలకు పాత్రులు కావాలి.

–రామల సునీత, అసిస్టెంట్‌ కమిషనర్‌, దేవాదాయధర్మాదాయశాఖ, వరంగల్‌

హన్మకొండ కల్చరల్‌: తెలంగాణ సంస్కృతి విభిన్నమైంది. జీవనపోరాటంలో ఎన్ని కష్టాలు ఎదురైనా బతకడం.. దీంతో పాటు ఇతరులు కూడా చల్లంగా బతకాలని భావించడం ఇక్కడి ప్రజల ప్రత్యేకత. బతుకు.. బతికించు.. అన్నదే ఇక్కడి జీవనవేదం. ఆకాశంలో ఇంద్రధనస్సుతో పోటీ పడుతూ.. సృష్టిలో భూమి మీద మట్టి నుంచి వచ్చిన ఎన్నెన్నో రంగుల పూలు.. అలా ఎన్ని పూలు పూసినా అన్ని కూడా పరమాత్ముడి కోసమే అన్నట్లు బతుకమ్మలను పేర్చుకుని ఆ జగన్మాత, పరమేశ్వరుడి ప్రీతికోసం బయలుదేరడమే బతుకమ్మ పండుగ. ఈ క్రమలో నేటి (ఆదివారం) నుంచి ఎంగిలిపూల బతుకమ్మతో ప్రారంభయ్యే ఈ వేడుకను ఆడపచులు ఈ నెల 29 సద్దుల బతుకమ్మ వరకు జరుపుకోనున్నారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం తొమ్మిదిరోజుల పాటు జరుపుకోనున్న బతుకమ్మ వేడుకలకు అన్ని ఏర్పాట్లు చేసింది. పార్టీలకతీతంగా నేడు వేయిస్తంభాల దేవాలయం నుంచి బతుకమ్మ ఉత్సవం ప్రారంభించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.

కరువులో పుట్టిన తల్లి బతుకమ్మ..

19వ శతాబ్దం ప్రారంభంలో అనేక క్షామాలు, కరువులు విలయతాండవం చేశాయి. ఈ నేపథ్యంలో ప్రజలు తాము చల్లగా బతకడానికి విభిన్న రీతిలో బతుకమ్మ పండుగను ప్రారంభించినట్లు జానపదుల పరిశోధకుల అభిప్రాయం. తెలంగాణ గ్రామాల్లో ఇప్పటికీ ఒకతల్లికి వరుసగా పిల్లలు పుట్టి చనిపోతున్నప్పుడు ఆ ఇంటి వారు పుట్టిన పాపను చాటలో పెట్టి పెంటదిబ్బ మీద కొద్దిసేపు పడుకోబెట్టి పెంటయ్య లేదా పెంటమ్మ అని పేరు పెట్టే సంప్రదాయం కనిపిస్తుంది. ఈక్రమంలోనే బతుకు అమ్మ బతుకమ్మగా పిలిచి ఉంటారని అంటారు. మహిషాసురమర్థన సమయంలో పార్వతీదేవి మూ ర్చిల్లి ఉన్నప్పుడు సీ్త్రలు ఆందోళనతో బతుకమ్మ అని పాటలు పాడారని ప్రజల్లో అభిప్రాయం ఉంది.

చారిత్రక విభాతసంధ్యలో..

నిజాం ఫ్యూడల్‌ రాజుల కింద చాలా సంవత్సరాలు మగ్గిపోయి బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా ఉండడంతో తెలంగాణ ప్రాంతంలో దేవాలయాలను సందర్శించడం మృగ్యమైపోయింది. అలాంటి చారిత్రక విభాతసంధ్యలో బహిరంగంగా దేవాలయాల్లో జరుపుకునే పూజలకు బదులు అనేక సంప్రదాయాల రూపంలో వచ్చిన ఎన్నో పండుగలు ఆచారాలు ఇప్పటికీ కనిపిస్తాయి. బతుకమ్మ పండుగ అలా వచ్చిందే.

బతుకమ్మ కథ..

ధరచోళ రాజైన ధర్మాంగుడు, అతడి భార్య సత్యవతి నోముల ఫలితంగా నూరుమంది సంతానం కలుగుతారు. కానీ ఆ నూరుగురు సంతానం శత్రురాజులతో జరిగిన యుధాల్లో హతమవుతారు. కుమారులు చనిపోయిన దుఃఖంతో ఆ దంపతులు శివుని కోసం కఠోర తపస్సు చేస్తారు. శివుడు మెచ్చి ప్రత్యక్షమై వరం కోరుకొమ్మని అడుగుతాడు. అప్పుడు ఆ దంపతులు శివుడి ఇల్లాలు అయిన పార్వతిదేవీని తమ పుత్రికగా ప్రసాదించమని అడుగుతారు. ఆ విధంగా పార్వతీదేవి వరంతో సాక్షాత్తు శ్రీలక్ష్మిదేవి.. సత్యవతి, ధర్మాంగుడి దంపతుల పుత్రికగా జన్మిస్తుంది. కశ్యపుడు, అంగీరసుడు, కపిలుడు మొదలైన మునులు ఆ పాపకు బతుకమ్మ అని పేరు పెడుతారు. శ్రీమహావిష్ణువు చక్రాంకుడు అనే రాజు రూపంలో వచ్చి శ్రీలక్ష్మిదేవినే వివాహం చేసుకుంటాడు. వారు అనేక మంది సంతానంతో చాలా కాలంపాటు రాజ్యపాలన చేస్తారు.

ఎంగిలి పూల బతుకమ్మ..

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ. ఈ పండుగ వచ్చిందటే ఇంటిల్లిపాదికి సంబురమే. ఆశ్వయుజ శుదర్ధపాడ్యమికి ముందు వచ్చే అమావాస్యను జానపదులు పెత్రమాస అంటారు. బతుకమ్మ పెత్రమాసనాడు ప్రారంభమై మహర్నవమి రోజున సద్దులతో ముగుస్తుంది. మొదటి రోజున ఎంగిలి పూల బతుకమ్మగా, తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మగా జరుపుకుంటారు. బతుకమ్మను పేర్చుకోవడానికి ఒక్కరోజు ముందే పూలు సేకరిస్తారు. అలా తెచ్చుకున్న వారి ఇంటిలో ఈ పూలు ఒకరోజు నిద్ర చేస్తాయి. ఆ విధంగా నిద్ర చేసిన పూలతో బతుకమ్మను పేర్చడం వల్ల ఎంగిలి పూల బతుకమ్మ అని పిలుస్తారు. మొదటి రోజు బతుకమ్మ ఆటను గ్రామంలోని శివాలయం, శివాలయం లేని పరిస్థితుల్లో మరే ఇతర ఆలయంలోనైనా జరుపుకుంటారు.

కొనుగోళ్లతో రోడ్లన్నీ రద్దీ..

బతుకమ్మ పండుగకు పూలు, ఇతర సామగ్రి కొనుగోళ్లు చేయడానికి వచ్చిన వారితో శనివారం రాత్రి రోడ్లన్నీ కిక్కిరిశాయి. హనుమకొండ చౌరస్తా, కుమార్‌పల్లి, టైలర్‌స్ట్రీట్‌ , అంబేడ్కర్‌ సెంటర్‌, అదాలత్‌, వరంగల్‌లోని పిన్నవారి వీధి, రామన్నపేట, బట్టలబజార్‌, కాశిబుగ్గ, గోపాలస్వామి గుడి, హనుమకొండ భవానీనగర్‌బోర్డు, సుబేదారిలోని అమరవీరుల స్తూపం, కాజీపేటలోని బాపూజీ నగర్‌ తదితర ప్రాంతాల్లో పూల అమ్మకాలు జోరుగా సాగాయి.

పితృ అమావాస్యగా..

తెలంగాణలో ఈ రోజున పితరుల/ పితృఅమావాస్యగా జరుపుకుంటారు. చనిపోయిన తమ ఇంటి పెద్దలకు ఆత్మశాంతి జరగాలని బ్రాహ్మణులకు బియ్యం ఇస్తారు. ఉదయమే తలస్నానం చేసి పొడి దుస్తులు ధరిస్తారు. పల్లెంలో బియ్యం పోసి మోదుగాకు విస్తారులలో పప్పు, చింతపండు, ఉప్పు, కారం, అందుబాటులో ఉండే కూరగాయలు పెట్టుకుని వస్తారు. అయ్యగారింటికి వెళ్లి అతడితో బొట్టుపెట్టించుకుని తిరిగి ఇంటికి వచ్చాక భోజనాలు చేస్తారు. ఈ రోజు పెద్దల (చనిపోయిన ఇంటి పెద్దలు) పేరుమీద బియ్యం ఇస్తారు. ఈ రోజున వీలులేని పరిస్థితి ఉన్నవారు దసరా రోజు బియ్యం ఇవ్వడం సంప్రదాయం.

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ1
1/4

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ2
2/4

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ3
3/4

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ4
4/4

తెలంగాణ సంస్కృతికి ప్రతీక బతుకమ్మ నేడు ఎంగిలి పూలతో వేడ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement