
2,677.050 మెట్రిక్ టన్నుల ఐపీఎల్ యూరియా రాక
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వేస్టేషన్ ప్రాంగణంలోని గూడ్స్‌షెడ్‌కు శనివారం 2,677.050 మెట్రిక్ టన్నుల ఐపీఎల్ కంపెనీకి చెందిన యూరియా చేరింది. గూడ్స్‌షెడ్‌కు చేరిన వ్యాగన్‌ను కంపెనీ ప్ర తినిధులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి రికార్డు ప్రకారం పరిశీలించారు. జిల్లా వ్యవసాయ అధికారి అనురాధ ఆదేశాల మేరకు ఐపీఎల్ యూరియాను వరంగల్ జిల్లాకు 417.05 మెట్రిక్ టన్నులు, హనుమకొండ జిల్లాకు 450, ములుగు జిల్లాకు 280, జయశంకర్ భూపాలపల్లి జిల్లాకు 500, జనగామ జిల్లాకు 480, మహబూ బాబాద్ జిల్లాకు 450 మెట్రిక్ టన్నుల యూరి యాను కేటాయించారు. ఉదయం నుంచే లారీల్లో జిల్లాల వారీగా చేరవేసే కార్యక్రమాన్ని చేపట్టామని వ్యవసాయ అధికారి రవీందర్‌రెడ్డి తెలిపారు.
విద్యుత్ అధికారులపై
ఫిర్యాదు
ఖిలా వరంగల్: విద్యుత్ అధికారుల నిర్లక్ష్యంతో మూడు వినోద్ మృతి చెందాడని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు. ఆయన కథనం ప్రకారం.. రాయపర్తి మండలం ఏకే తండాకు చెందిన మూడు వినోద్ (22) రెండేళ్లుగా స్నేహితులతో కలిసి ప్రైవేట్ విద్యుత్ కాంట్రాక్టర్ బొంపల్లి సంపత్‌రావు వద్ద స్తంభాలు ఎత్తే కూలి పనులు చేస్తున్నాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం ఉదయం వరంగల్‌లో ఓ గార్డెన్ వద్ద ఐరన్ స్తంభాలను ఎత్తుతుండగా ప్రమాదవశాత్తు విద్యుదాఘాతంతో వినోద్ మృతి చెందాడు. అధికారులు భద్రతా చర్యలు తీసుకుంటే వినోద్ మృతి చెందేవాడు కాదని మృతుడి కుటుంబ సభ్యులు పేర్కొన్నారు. మృతుడి తల్లి సంధ్య ఫిర్యాదు మేరకు శంభునిపేట ఏడీ పి.చంద్రమౌళి, ఏఈ దేవరాయ్ సంపత్, లైన్ ఇన్‌స్పెక్టర్ భద్రయ్య, లైన్‌మెన్ కోడం సాంబయ్యపై శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్ తెలిపారు.