
క్షేత్రస్థాయిలో పరిశీలన
హన్మకొండ: హనుమకొండలోని రాంనగర్‌లో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మేయర్ గుండు సుధారాణి, కమిషనల్ చాహత్ బాజ్‌పాయ్, కార్పొరేటర్ చాడా స్వాతి పర్యటించారు. నయీంనగర్ కిషన్‌పుర నుంచి పోలీసు గ్రౌండ్ పక్కన నుంచి రాంనగర్‌కు వచ్చే రోడ్డును పరిశీలించారు. కార్పొరేటర్ చాడా స్వాతి రోడ్‌ను వెడల్పు చేయాలని కోరగా శనివారం వారు పరిశీలించారు. రానంగర్‌లో అవసరమైన డ్రెయినేజీ నిర్మాణాల్ని పరిశీలించారు. కార్యక్రమంలో బీజేపీ సీనియర్ నాయకుడు చాడా శ్రీనివాస్‌రెడ్డి, స్థానికులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.
పూల వ్యర్థాలతో కంపోస్ట్ తయారీకి
ప్రతిపాదనలు
వరంగల్ అర్బన్: పూల వ్యర్థాలతో కంపోస్ట్ యార్డు తయారీకి ప్రతిపాదనలు రూపొందించాలని బల్దియా కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్ ఆదేశించారు. శనివారం ఉదయం హనుమకొండ బాలసముద్రం మార్కెట్, పెట్ పార్కులను క్షేత్ర స్థాయిలో తనిఖీ చేశారు. ఈసందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ బతుకమ్మ వేడుకల సందర్భంగా పెద్ద మొత్తంలో పూలు వినియోగిస్తారని, మిగిలిన పూల వ్యర్థాలను సేకరించడానికి ప్రత్యేక వాహనాలు ఏర్పాటు చేసి సేకరించాలన్నారు. తనిఖీల్లో సీఎంహెచ్‌ఓ రాజారెడ్డి, వెటర్నరీ వైద్యుడు డాక్టర్ గోపాల్‌రావు, సానిటరీ ఇన్‌స్పెక్టర్ అనిల్ కుమార్ ఉన్నారు.