
కోటలో విదేశీయుల సందడి..
ఖిలా వరంగల్: చారిత్రక ఖిలా వరంగల్ కో టలో శనివారం విదేశీయులు సందడి చేశారు. హైదరాబాద్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో 15 రోజులుగా శిక్షణ పొందుతున్న వివిధ దేశాల్లోని మీడియా సంస్థలో పనిచేస్తున్న 27 దేశాలకు చెందిన ప్రతినిధులు వరంగల్‌లో పర్యటించారు. ఈ సందర్భంగా మధ్యకోటలోని నాలుగు కీర్తి తోరణాల నడుమ అద్భుత శిల్ప కళా సంపదను ఆసక్తిగా తిలకించారు. అనంతరం ఖుషిమహాల్, ఏకశిల గుట్ట, రాతి, మట్టికోట అందాలను వీక్షించి ఫిదా అయ్యారు. అంతకు ముందు కాకతీయుల చరిత్రను కోట గైడ్ దేనబోయిన రవి యాదవ్ వివరించారు. అనంతరం తమ వెంట తెచ్చుకున్న కెమెరాలతో శిల్ప కళా సంపదను బంధించారు. కార్యక్రమంలో మిల్స్‌కాలనీ ఇన్‌స్పెక్టర్ బొల్లం రమేశ్, టీజీటీడీసీ కోట ఇన్‌చార్జ్ అజయ్, పురావస్తుశాఖ కోట ఇన్‌చార్జ్ శ్రీకాంత్, ఎస్సై శ్రవణ్, సిబ్బంది పాల్గొన్నారు.
బాలల సంరక్షణకు
సమన్వయంతో పనిచేయాలి
● వరంగల్ పోలీస్ కమిషనర్
సన్‌ప్రీత్ సింగ్
వరంగల్‌క్రైం : బాలల సంరక్షణకు ప్రభుత్వ విభాగాలు సమన్వయంతో పనిచేయాలని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ పిలుపునిచ్చారు. ఇటీవల ముగిసిన ఆపరేషన్ ముస్కాన్ 11వ విడత విజయవంత అభినందన సభను శనివారం హ్యుమన్ ట్రాఫికింగ్ విభాగం ఆధ్వర్యంలో నిర్వహించారు. వరంగల్, హనుమకొండ, జనగామ జిల్లాలకు చెందిన పోలీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ, బాలల పరిరక్షణ విభాగం, చైల్డ్ వెల్ఫేర్ కమిటీలు, ఎన్జీఓస్, ఇతర ప్రతినిధులు పాల్గొన్న ఈ కార్యక్రమానికి కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్ హాజరై మాట్లాడారు. అందరి సమన్వయంతో ఆపరేషన్ కార్యక్రమంలో భాగంగా 177 మంది చిన్నారులకు వెట్టిచారికి నుంచి విముక్తి కల్పించామన్నారు. బాలకార్మిక రహిత సమాజ బా ధ్యత అందరిపై ఉందన్నారు. కార్యక్రమంలో ఆయా జిల్లాల చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్‌పర్సన్లు వసుధ, అనిల్‌చందర్‌రావు, ఉప్పలయ్య, యాంటీ హ్యుమన్ ట్రాఫిక్ యూనిట్ ఇన్‌స్పెక్టర్ శ్యాంసుందర్, హనుమకొండ బీఆర్‌బీ కోఆర్డినేటర్ అవంతి, తదితరులు పాల్గొన్నారు.

కోటలో విదేశీయుల సందడి..