
ముందే వచ్చిన శీతాకాల అతిథి!
హన్మకొండ అర్బన్: సాధారణంగా శీతాకాలం(అక్టోబర్– మార్చి)లో దక్షిణ ఆసియా, భారతదేశం (తెలంగాణ, ఆంధ్రప్రదేశ్), శ్రీలంక వరకు వలస వచ్చే బ్లూథ్రోట్ (నీలగొంతు పిట్ట) ఈ ఏడాది ముందే వచ్చింది. దీని శాసీ్త్రయ నామం లూస్కినియా స్వేసికా. ఈ పక్షి ఫొటోను నగరానికి చెందిన ప్రకృతి ప్రేమికుడు జగన్ కాజీపేట మండలం అమ్మవారిపేట చెరువు సమీపంలో గంటల కొద్ది నిరీక్షించి తన కెమెరాలో బంధించారు. సాధారణంగా శీతాకాలంలో చెరువులు, నీరు, గడ్డిపొదలు, పొలాల అంచుల దగ్గర ఎక్కువగా ఈ పక్షులు కనిపిస్తాయని తెలిపారు. మగపక్షి గొంతు భాగంలో నీలి రంగు ఉంటుంది. అందుకే దీనికి బ్లూథ్రోట్ అనే పేరు వచ్చిందని ఆయన పేర్కొన్నారు. ఇది చాలా చు రుకై న పిట్ట అని, తరచూ తోక కదుపుతూ, కిందికి పైకి ఎగిరి కీటకాలను పట్టుకుంటుందని వివరించారు. దీని కూత మధురంగా ఉంటుందని, కొన్నిసార్లు ఇతర పక్షుల స్వరాలను కూడా అనుకరిస్తుందని పేర్కొన్నారు. ఇది ప్రకృతి వలసల పరిశోధనలకు ముఖ్యమైన జాతిగా కూడా వివరించారు.

ముందే వచ్చిన శీతాకాల అతిథి!