
నవరాత్రి ఉత్సవాలను విజయవంతం చేయాలి
ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి
హన్మకొండ కల్చరల్: వేయిస్తంభాల ఆలయంలో ఈనెల 22 నుంచి ప్రారంభమయ్యే శ్రీదేవీశరన్నవరాత్రి ఉత్సవాల్ని విజయవంతం చేయాలని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి అన్నారు. గురువారం హనుమకొండ సర్క్యుట్ గెస్ట్ హౌస్‌లో జరిగిన కార్యక్రమంలో దేవాలయ ఈఓ అనిల్‌కుమార్, ప్రధానార్చకుడు గంగు ఉపేంద్రశర్మ పాల్గొని ఉత్సవాల ఆహ్వనపత్రికను ఆవిష్కరించారు. ఈసందర్భంగా ఎమ్మెల్యే రాజేందర్‌రెడ్డి మాట్లాడుతూ.. దేవాలయంలో జరిగే ఉత్సవాల్లో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలుగకుండా ఏర్పాట్లు చేయాలని అధికారుల్ని ఆదేశించినట్లు తెలిపారు. ఈఓ అనిల్‌కుమార్, ఉత్సవ సమితి కార్యదర్శి కోనశ్రీఽకర్, రవీందర్‌రెడ్డి, సభ్యులు పులి రజనీకాంత్, రావుల ధనుంజయ తదితరులు పాల్గొన్నారు.
నవరాత్రి ఉత్సవాలకు ఆహ్వానం
భద్రకాళి దేవాలయంలో ఈ నెల 22 నుంచి నిర్వహించనున్న శరన్నవరాత్రి ఉత్సవాలకు హాజరుకావాలని జిల్లా అధికారులను ఆహ్వానించారు. గురువారం నాయిని రాజేందర్‌రెడ్డి, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు స్నేహశబరీశ్, సత్యశారద, గ్రేటర్ కమిషనర్ చాహత్ బాజ్‌పాయ్, వరంగల్ అదనపు కలెక్టర్ సంధ్యారాణి, హనుమకొండ అదనపు కలెక్టర్ వెంకట్‌రెడ్డి, డీఆర్‌ఓ వైవీ గణేశ్, కుడా అధికారులు అజిత్‌రెడ్డి, భీంరావుకు వరంగల్ దేవాదాయశాఖ ఏసీ, భద్రకాళి ఆలయ ఈఓ రామల సునీత, అర్చకులు శేషు, సిబ్బందితో కలిసి ఆహ్వానపత్రికలు అందజేశారు. ఉత్సవాలకు హాజరు కావాలని కోరారు.