
రోడ్ల వెంట రోత.. వ్యాధుల మోత
గ్రేటర్ వరంగల్ నగరంలో డ్రెయినేజీ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. రోడ్లపైనే మురుగునీరు నిలుస్తోంది. ఈగలు దోమలు విజృంభిస్తున్నాయి. చినుకుపడితే చాలు కాల్వల్లోని నీరు రోడ్లపై పారుతోంది. అసలే వర్షాకాలం కావడంతో వ్యాధులు ప్రబలుతున్నాయి. ఆస్పత్రులు కిటకిటలాడుతున్నాయి. ట్రైసిటీలోని పలు చోట్ల డ్రెయినేజీలు ప్రమాదకరంగా మారాయి. కొన్ని చోట్ల నెలల తరబడిగా నిర్మాణ పనులు కొనసాగుతూనే ఉన్నాయి. బల్దియా అధికారులు పట్టించుకుని పారిశుద్ధ్య సమస్యకు పరిష్కారం చూపాలని నగరవాసులు కోరుతున్నారు. – సాక్షి స్టాఫ్ ఫొటోగ్రాఫర్, వరంగల్

రోడ్ల వెంట రోత.. వ్యాధుల మోత

రోడ్ల వెంట రోత.. వ్యాధుల మోత