
గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి
● కలెక్టర్ స్నేహ శబరీష్
హన్మకొండ అర్బన్: జిల్లాలోని గర్భిణులు, బాలింతలు అంగన్‌వాడీ కేంద్రాల్లో అందించే పౌష్టికాహారాన్ని తీసుకోవాలని హనుమకొండ కలెక్టర్ స్నేహ శబరీష్ సూచించారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 16 వరకు నిర్వహించనున్న పోషణ మాసం కార్యక్రమాల వాల్‌పోస్టర్‌ను కలెక్టర్ గురువారం ఆవిష్కరించి మాట్లాడారు. పోషణ మాసం కార్యక్రమాన్ని జిల్లా వ్యాప్తంగా ప్రణాళికాబద్ధంగా నిర్వహిచాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారి జయంతి, డీఆర్‌డీఓ మేన శ్రీను, వైద్యశాఖ జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ ఇక్తాదర్ అహ్మద్, డెమో అశోక్‌రెడ్డి, హన్మకొండ అర్బన్ ప్రాజెక్టు సీడీపీఓ విశ్వజ, పోషణ్ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్ సుమలత, మహిళా సాధికారిత మిషన్ శక్తి కోఆర్డినేటర్ కల్యాణి తదితరులు పాల్గొన్నారు.
యూరియా వచ్చేసింది..
ఖిలా వరంగల్: వరంగల్ రైల్వే స్టేషన్ గూడ్స్ షెడ్‌కు గురువారం 1,386.900 మెట్రిక్ ట న్నుల స్పిక్ కంపెనీ యూరియా, 507 మెట్రిక్ టన్నుల 20.20.013 రకం ఎరువులు చేరాయి. యూరియా వ్యాగన్‌ను కంపెనీ అధికారులు రమణరెడ్డి, తిరుమల్‌రావులతో కలిసి వ్యవసాయ అధికారులు విజ్ఞాన్, రవీందర్‌రెడ్డి పరి శీలించారు. 1,386.900 మెట్రిక్ టన్నుల స్పిక్ యూరియాను వరంగల్ జిల్లాకు 256, హనుమకొండ 250, ములుగు 240, భూపాలపల్లి 300, జనగామ జిల్లాకు 340 మెట్రిక్ టన్నులు కేటాయించారు.
విద్యార్థులు పఠనాసక్తి
పెంపొందించుకోవాలి
● హనుమకొండ డీఈఓ వాసంతి
విద్యారణ్యపురి: విద్యార్థులు పఠనాసక్తి పెంపొందించుకోవాలని హనుమకొండ జిల్లా వి ద్యాశాఖాధికారి డి.వాసంతి కోరారు. ఎల్కతుర్తి మండలం వల్భాపూర్ జిల్లా పరిషత్ హైస్కూల్‌కు విశ్రాంత ఉపాధ్యాయుడు తాడూరి రమేశ్ ఇచ్చిన రూ.50 వేల విరాళంతో గ్రంథాలయం, గ్రానైట్ యజమాని సత్యనారాయణ ఇచ్చిన రూ.50 వేలతో ల్యాబ్‌ను పీజీ హెచ్‌ఎం బద్దం సుదర్శన్‌రెడ్డి ఏర్పాటు చేయించారు. ఈ మేరకు గురువారం ల్యాబ్, గ్రంథాలయాన్ని ఆమె దాతలతో కలిసి ప్రారంభించి మాట్లాడారు. పుస్తక పఠనంతోనే విద్యార్థుల్లో జ్ఞానం పెరుగుతుందన్నారు. మండల విద్యాశాఖాధికారి సత్యనారాయణ, స్కూల్ కాంప్లెక్స్ హెచ్‌ఎం దుర్గాభవాని, జిల్లా కమ్యూనిటీ మొబిలైజింగ్ కోఆర్డినేటర్ సుదర్శన్‌రెడ్డి, పాఠశాల చైర్‌పర్సన్ నీరజ, గ్రామ మాజీ సర్పంచ్ రత్నాకర్, ప్రతాప్, రామారావు, ఉపాధ్యాయులు శ్రీనివాస్‌రెడ్డి, వెంకటస్వామి, వెంకటసుహాసిని, పద్మలత, కల్యాణి, రమాదేవి, ప్రసాద్‌రావు, అఖిల్, విద్యార్థులు పాల్గొన్నారు.

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి

గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవాలి