
విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలి
మామునూరు: విద్యార్థులను ఉత్తములుగా తీర్చిదిద్దాలని ఎంఈఓ ఎస్.వెంకటేశ్వర్‌రావు, ట్రస్మా రాష్ట్ర అధ్యక్షుడు శివరాత్రి యాదగిరి, నిస్సా జాతీయ ఉపాధ్యక్షుడు జేఎస్ పరంజ్యోతి, ట్రస్మా కార్యదర్శి ఎన్.వెంకటేశ్వరరావు సూచించారు. ఆర్టీఏ జంక్షన్ సమీపంలోని బిర్లా ఓపెన్ మైండ్ ఇంటర్నేషనల్ హైస్కూల్ ప్రాంగణంలో ట్రస్మా జిల్లా అధ్యక్షుడు ఆడెపు శ్యాం అధ్యక్షతన బుధవారం ఉత్తమ ఉపాధ్యాయులకు అవార్డులు అందించారు. టస్మా, వడుప్సా జిల్లా ప్రతినిధులు బిల్లా రవి, జ్ఞానేశ్వర్‌సింగ్, కోడెం శ్రీధర్, బుచ్చిబాబు, సంతోష్‌రెడ్డి, జనార్దన్, అడెపు వెంకటేశ్వర్లు, ముక్కెర రవీందర్, కూచన క్రాంతికుమార్, కూచన కవిత ఉన్నారు.