
రైల్వే ఎన్‌ఐ వర్క్స్..
కాజీపేట రూరల్ : కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని కాజీపేట, బల్లార్షా మధ్య ఆటోమెటిక్ బ్లాక్ సిగ్నలింగ్ రైల్వే ఎన్‌ఐ వర్క్స్‌తో పలు రైళ్లను రద్దు చేయడంతోపాటు పలు రైళ్లకు వివిధ స్టేషన్లలో హాల్టింగ్ ఎత్తివేసినట్లు దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో ఎ.శ్రీధర్ గురువారం తెలిపారు.
రద్దయిన రైళ్లు
ఈ నెల 19వ తేదీన కాజీపేట–సిర్పూర్‌టౌన్ (170 03) ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17004) రామగిరి ప్యాసింజర్, ఈ నెల 18వ తేదీన(నేడు) కాజీపేట–బల్లార్షా (17035) రామగిరి ప్యాసింజర్, బల్లార్షా–కాజీపేట (17036) ప్యాసింజర్, సిర్పూర్‌టౌన్–కరీంనగర్ (87771) పుష్‌పుల్, కరీంనగర్–సిర్పూర్‌టౌన్ (67772) పుష్‌పుల్ రద్దయ్యాయి.
పాక్షికంగా రద్దయిన రైళ్లు
ఈ నెల 19వ తేదీన భద్రాచలంరోడ్–బల్లార్షా (1 7033) సింగరేణి కాజీపేట–బల్లార్షా మధ్య, సిర్పూర్‌టౌన్–భద్రాచలంరోడ్ (17034) సింగరేణి సిర్పూర్ టౌన్–కాజీపేట మధ్య, సిర్పూర్‌కాగజ్‌నగర్–సికింద్రాబాద్ (17234) ఎక్స్‌ప్రెస్ సిర్పూర్‌కాగజ్‌నగర్–కాజీపేట మధ్య, ఈ నెల 18న సికింద్రాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17233) ఎక్స్‌ప్రెస్ కాజీపేట–సిర్పూర్‌కాగజ్‌నగర్ మధ్య రద్దు.
తాత్కాలికంగా హాల్టింగ్ ఎత్తివేత..
ఈ నెల 19వ తేదీన హైదరాబాద్–సిర్పూర్‌కాగజ్‌నగర్ (17011) ఎక్స్‌ప్రెస్‌కు, సిర్పూర్‌కాగజ్‌నగర్–బీదర్ (17012) ఎక్స్‌ప్రెస్‌కు మందమర్రి రైల్వే స్టేషన్‌లో హాల్టింగ్ ఎత్తివేశారు.
రెగ్యులేషన్ ట్రైన్..
ఈ నెల 19వ తేదీన డెహ్రాడూన్–చర్లపల్లి (07078) ఎక్స్‌ప్రెస్ 30 నిమిషాల పాటు రెగ్యులెటెడ్ చేశారు.
● పలు రైళ్లు రద్దు..హాల్టింగ్ ఎత్తివేత
● ఈ నెల 18, 19 తేదీల్లో అమలు