
వేతన ఒప్పందం అమలు చేయాలి
హన్మకొండ: టీజీఎస్ ఆర్టీసీ కార్మికులకు పెండింగ్‌లో ఉన్న వేతన ఒప్పందాన్ని అమలు చేయాలని, ఎరియర్స్ చెల్లించాలని స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ కార్యదర్శి బి.ఉపేంద్రచారి డిమాండ్ చేశారు. మంగళవారం వరంగల్ రీజియన్ వ్యాప్తంగా డిపోల వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. హనుమకొండలోని వరంగల్–1, వరంగల్–2, హనుమకొండ డిపోల వద్ద స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ ఆవిర్భావ దినోత్సవాన్ని జరుపుకున్నారు. డిపో కమిటీల ఆధ్వర్యంలో యూనియన్ పతకాన్ని ఆవిష్కరించారు. బి.ఉపేంద్రచారి మాట్లాడుతూ.. ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం వేతన సవరణ చేయకుండా ఆర్టీసీ కార్మికులకు అన్యాయం చేస్తుందని ఆందోళన వ్యక్తం చేశారు. కార్మికులందరికీ ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. బాడీ బిల్డింగ్, వర్క్‌షాపుల తరలింపులు నిలిపివేయాలని కోరారు. కార్యక్రమంలో స్టాఫ్ అండ్ వర్కర్స్ ఫెడరేషన్ వరంగల్ రీజియన్ అధ్యక్షుడు తాళ్లపల్లి ఎల్ల య్య, నాయకులు నారగోని శ్రీనివాస్, పాషా, బి.సంపత్, వై.శ్రీనివాస్ తదితరులున్నారు.