
విలువలతో కూడిన విద్య అందించాలి
కేయూ రిజిస్ట్రార్ రామచంద్రం
కేయూ క్యాంపస్: రాజనీతి శాస్త్రంలో సమకాలీన అంశాలను, సామాజిక సమస్యలపై నైతిక విలువలతో కూడిన విద్యను అందించేందుకు అధ్యాపకులు కృషి చేయాలని కేయూ రిజిస్ట్రార్ వి.రామచంద్రం అన్నారు. మంగళవారం హనుమకొండలోని కేడీసీలో రాజనీతి శాస్త్ర విభాగం ఆధ్వర్యంలో నిర్వహించిన ఒక రోజు వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఉత్తమ రాజకీయ నాయకత్వానికి మంచి పౌరుడిగా రాణించేందుకు రాజనీతి శాస్త్రం దోహదం చేస్తుందన్నారు. ఇందులో కేడీసీ రాజనీతిశాస్త్ర విభాగాధిపతి, వర్క్ షాప్ కన్వీనర్ కవిత, కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ గుర్రం శ్రీనివాస్, కేయూ రాజనీతి శాస్త్ర విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీస్ చైర్మన్ కృష్ణయ్య, ములుగు ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ మల్లేశం, పరకాల ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ బి.సంతోశ్‌కుమార్, ప్రొఫెసర్ కె.శ్రీదేవి, స్టాఫ్ సెక్రటరీ ప్రొఫెసర్ రవికుమార్, వైస్ ప్రిన్సిపాల్ రజనీలత, వివిధ జిల్లాల్లోని కళాశాలల రాజనీతి శాస్త్ర అధ్యాపకులు పాల్గొన్నారు.