
నార్కొటిక్స్ డీఎస్పీగా రమేశ్‌కుమార్
రామన్నపేట : వరంగల్ నార్కొటిక్స్ పోలీస్ స్టేషన్ డీఎస్పీగా పి.రమేశ్‌కుమార్ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. కాగా ఇక్కడ పనిచేసిన కె.సైదులు హైదరాబాద్‌లోని తెలంగాణ యాంటీ నార్కొటిక్స్ బ్యూరో ప్రధాన కార్యాలయానికి బదిలీ అయ్యారు. డీఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన రమేశ్‌కుమార్‌కు ఇన్‌స్పెక్టర్ రవీందర్, సిబ్బంది పూలబొకేలు అందించి శుభాకాంక్షలు తెలిపారు.
పంచరామాలకు
ఆర్టీసీ ప్రత్యేక బస్సులు
హన్మకొండ : పంచరామాల (శైవ క్షేత్రాలు) సందర్శనకు ఆర్టీసీ ప్రత్యేకంగా సూపర్ లగ్జరీ బస్సులు నడపనున్నట్లు టీఎస్‌ఆర్టీసీ వరంగల్ రీజినల్ మేనేజర్ డి.విజయ భాను సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. శ్రావణ మాసంలో భక్తుల సౌకర్యార్థం ఆంధ్రప్రదేశ్‌లో ప్రసిద్ధి చెందిన అమరావతి అమరలింగేశ్వర స్వామి, భీమవరం శ్రీ సోమేశ్వర స్వామి, పాలకొల్లు క్షీరా లింగేశ్వర స్వామి, ద్రాక్షారామం భీమేశ్వర స్వామి, సామర్లకోట భీమేశ్వర స్వామి ఆలయాలు దర్శించుకునేందుకు టూర్ ప్యాకేజీ రూపొందించినట్లు వెల్లడించారు. ఒకేరోజు ఐదు శైవ క్షేత్రాలను దర్శించుకోవడం ద్వారా భక్తులు ఆధ్యాత్మిక అనుభవాలు పొందవచ్చని పేర్కొన్నారు. ఆగస్టు 3వ తేదీన సాయంత్రం 6గంటలకు హనుమకొండ బస్‌స్టేషన్ నుంచి ప్రారంభమై సోమవారం అన్ని క్షేత్రాల దర్శనం అనంతరం తిరిగి మంగళవారం హనుమకొండకు చేరుకుంటుందని తెలిపారు. చార్జీలు పెద్దలకు రూ.2,300, పిల్ల లకు రూ.1,400గా నిర్ణయించినట్లు వివరించారు. మరిన్ని వివరాలు, టికెట్ బుకింగ్ కోసం 9063407493, 77805 65971, 98663 73825, 99592 26047 నంబర్లలో సంప్రదించాలని కోరారు.
పెండింగ్ కేసుల
పరిష్కారానికి సహకరించాలి
వరంగల్ లీగల్ : వివిధ కోర్టుల్లో పెండింగ్‌లో ఉన్న కేసులను మధ్యవర్తిత్వం ద్వారా పరిష్కరించేందుకు న్యాయవాదులు సహకరించాలని హనుమకొండ జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ కె.పట్టాభిరామారావు కోరారు. సోమవారం జిల్లా కోర్టులోని న్యాయసేవాధికార సంస్థ భవ న్‌లో ‘మీడియేషన్ డ్రైవ్’ పై న్యాయవాదులకు అవగాహన సదస్సు నిర్వహించారు. కక్షిదారులను మధ్యవర్తిత్వం ద్వారా కేసులు పరిష్కరించుకునేలా న్యాయవాదులు ప్రోత్సహించాలని సూచించారు. కార్యక్రమంలో ఇన్‌చార్జ్ డీఎల్‌ఎస్‌ఏ కార్యదర్శి రామలింగం, హనుమకొండ జిల్లా బార్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యనారాయణ, న్యాయవాదులు పాల్గొన్నారు.
బాక్సర్‌ల ప్రతిభ
నయీంనగర్: హైదరాబాద్ షేక్ పేటలో ఈ నెల 25 నుంచి 27 వరకు నిర్వహించిన ఇంటర్ స్టేట్ సబ్ జూనియర్ బాక్సింగ్ పోటీల్లో హనుమకొండ జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనబరిచి ఇద్దరు బాలికలు జాతీయ స్థాయికి ఎంపికయ్యారు. జాయిదా తన్వీర్, కె.సాయి ప్రణీత గోల్డ్ మెడల్స్, బి.భార్గవ్, ఎన్.హర్షవర్ధన్ సిల్వర్ మెడల్స్, పోగుల హర్షిత్, ఆర్యన్, ప్రసాద్ బ్రాంజ్ మెడల్స్ సాధించారని కోచ్, ఖేలో ఇండియా సీనియర్ బాక్సర్ దేవరకొండ ప్రభుదాస్ సోమవారం తెలిపారు.

నార్కొటిక్స్ డీఎస్పీగా రమేశ్‌కుమార్

నార్కొటిక్స్ డీఎస్పీగా రమేశ్‌కుమార్