
లండన్‌లో బోనాల జాతర
హన్మకొండ కల్చరల్: వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరం ఆధ్వర్యంలో బుధవారం ఆషాఢమాసం బోనాల జాతర వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈస్ట్ లండన్‌లోని మహాలక్ష్మి ఆలయంలో జరిగిన కార్యక్రమంలో వరంగల్ ఎన్‌ఆర్‌ఐ ఫోరం అధ్యక్షవ్డు శ్రీధర్‌నీలా, గుండు రజిత బోనాల వేడుకను ప్రారంభించారు. శ్రీధర్‌నీలా ‘సాక్షి’తో మాట్లాడుతూ.. దుర్గమ్మను ప్రతిష్టించామని, తెలంగాణలో జరుగుతున్న విధంగానే బోనం ఎత్తుకుని అమ్మవారికి దీపారాధన, పూజలు జరిపామని తెలిపారు. యూకే నలుమూలల నుంచి 2500కిపైగా ప్రవాస భారతీయులు పాల్గొన్నట్లు తెలిపారు.