
పురాతన వస్తువులు అందజేయాలి
హన్మకొండ కల్చరల్ : చరిత్రను అర్థం చేసుకోవడానికి, సంరక్షించుకోవడానికి, ప్రజలకు అవగాహన కల్పించడంతోపాటు గతం గురించి అధ్యయనం చేయడానికి ఉపయోగపడే పురాతన వస్తువులు, ప్రాచీన కళా ఖండాలను జానపద గిరి జన విజ్ఞానపీఠానికి అందజేయాలని పీఠం పీఠాధిపతి గడ్డం వెంకన్న కోరా రు. బుధవారం వరంగల్ హంటర్‌రోడ్‌లోని సురవరం ప్రతాపరెడ్డి తెలుగు విశ్వవిద్యాలయం జానపద గిరిజన విజ్ఞానపీఠంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీఠం స్థాపించి 30సంవత్సరాలు పూర్తయిందన్నారు. పీఠంలో అరుదైన జానపద వస్తువులతో మ్యూజియం ఏర్పాటు చేశామన్నారు. మ్యూజియంలోని వస్తువులు ప్రజలకు అవగాహన కల్పించడంతో పాటు భవిష్యత్ తరా లకు చరిత్రను తెలుసుకోవడానికి సాయపడతాయన్నారు. ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లా వాసులు తమ వద్ద ఉన్న ఉపయోగంలో ఉన్నా లేకపోయిన పురాతన రాతి, లోహ, చెక్క సంబంధ వంట సామాను, ఇంటి వస్తువులు, పనిముట్లు తదితర వస్తువులను అందజేయాలని కోరారు. వస్తువులు అందజేసిన వారి వివరాలు నమోదు చేస్తామని తెలిపారు. అసిస్టెంట్ ప్రొఫెసర్లు డాక్టర్ క్షమంతుల దామోదర్, డాక్టర్ బాసాని సురేశ్, డాక్టర్ చూరేపల్లి రవికుమార్, అబ్బు గోపాల్‌రెడ్డి, టెక్నికల్ అసిస్టెంట్ డాక్టర్ గంపా సతీశ్, సిబ్బంది పాల్గొన్నారు.
జానపద గిరిజన విజ్ఞానపీఠం
పీఠాధిపతి గడ్డం వెంకన్న
మ్యూజియంలోని
వస్తువులు

పురాతన వస్తువులు అందజేయాలి