వరంగల్ క్రైం:
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పోలీసులకు దేశ స్థాయిలో మంచి పేరుంది. ఇక్కడి వారు సాధించిన విజయాలను ఐపీఎస్ ట్రైనింగ్‌లో సైతం చెబుతారు. అంతటి ఘన చరిత్ర ఉన్న కమిషనరేట్ చరిత్ర క్రమక్రమంగా మసకబారుతోంది. కొంత మంది పోలీస్ అధికా రుల తీరు పోలీస్ శాఖ పరువును బజారున పడేలా చేస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తు న్న అధికారులపై కొంత కాలంగా ఎలాంటి క్రమశిక్షణ చర్యలు లేకపోవడంతో వారి అక్రమ సంపాదన ‘మూడు పువ్వులు.. ఆరు కాయలుగా’ వర్ధిల్లుతోంది. మూడు జిల్లాలకు విస్తరించి ఉన్న వరంగల్ పోలీస్ కమిషనరేట్‌కు నూతన కమిషనర్‌గా ఈనెల 10న సన్‌ప్రీత్‌సింగ్ బాధ్యతలు స్వీకరించారు. ఆయన ఎదుట అనేక సవాళ్లు కనిపిస్తున్నాయి.
ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై పట్టింపేది..?
కమిషనరేట్‌లోని అనేక మంది పోలీస్ అధికారులు ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై దృష్టిసారించడం లేదనే ఆరోపణలున్నాయి. టాస్క్‌ఫోర్స్ పోలీసులు కమిషనరేట్ వ్యాప్తంగా దాడులు నిర్వహించి పట్టుకున్న గుట్కాలు, గంజాయి, పీడీఎస్ బియ్యం, నకిలీ వస్తువులతో తరువాత ఫొటోలకు ఫోజులు ఇస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రభుత్వం నిషేధించిన గుట్కా, ఇసుక రవాణా, పీడీఎస్ బియ్యం వంటి వాటిల్లో నెలవారీ మాముళ్లతో పోలీసులు తరిస్తున్నారనే చర్చ జరుగుతోంది. హసన్‌పర్తి పోలీస్‌స్టేషన్ పరిధిలో పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేసే డాన్ ’కోటీ‘కి పడగలెత్తినట్లు ప్రచారంలో ఉంది.
భూపంచాయితీలకే ప్రాధాన్యం..
కమిషనరేట్ పరిధి చాలాపోలీస్‌స్టేషన్లలో భూముల పంచాయితీల హవా కొనసాగుతోంది. పలువురు పోలీస్ అధికారులు(ఎస్‌హెచ్‌ఓలు) పోలీసింగ్‌ను ఎస్సైలకు అప్పగించి వారు భూముల పంచాయితీ ల్లో తరిస్తున్నట్లు బహిరంగంగానే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నగరంలోని ఓ సబ్ డివిజన్‌లో పనిచేసే పోలీసు అధికారులు భూములకే మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారని తెలుస్తోంది. కొంత మంది పోలీస్ అధికారులు మరో అడుగు ముందుకేసి వారి బినామీల పేరు మీద వివాదంలో ఉన్న భూములను తక్కువ ధరకు కొనుక్కుని వివాదాన్ని పరిష్కరించుకుంటూ లక్షలు కూడబెట్టుకుంటున్నట్లు గుసగులు వినిపిస్తున్నాయి.
పోలీసింగ్‌పై మారిన ప్రాధాన్యం..!
శాంతి భద్రతలకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాల్సిన పోలీస్ అధికారుల ప్రాధాన్యత మారింది. రాత్రి పూట పెట్రోలింగ్ కొన్ని ప్రాంతాలకే పరిమితమైంది. విజుబుల్ పోలీసింగ్ లేక పట్టపగలే చోరీలు, హత్యలు, హత్యాయత్నాలు జరుగుతున్నాయి. వరంగల్ పోలీస్ కమిషనర్‌గా బాధ్యతలు స్వీకరించిన సన్‌ప్రీత్‌సింగ్ పోలీసింగ్‌కు మొదటి ప్రాధాన్యం అని ప్రకటించారు. దీంతో ప్రజల్లో ఆశలు రేకెత్తుతున్నాయి. పోలీస్ శాఖలో అక్రమాలకు పాల్పడుతు న్న కొంత మంది అధికారులపై చర్యలు తీసుకుంటే శాఖ గాడిన పడే అవకాశాలు ఎక్కువ ఉన్నాయని పలువురు అభిప్రాయ పడుతున్నారు.
కేసుల నమోదు ఇలా..
ట్రైసిటీ పరిధిలో ఈ సంవత్సరం ప్రారంభం నుంచి మూడు నెలల్లో ఐదు చైన్‌స్నాచింగ్ కేసులు నమోదయ్యయి. ద్విచక్ర వాహనాలపై వచ్చి మహిళల మెడలో నుంచి గొలుసులు లాక్కెళ్లారు. చోరీ కేసులు సుమారు 36 చోటుచేసుకున్నాయి. లక్షల రూపా యల విలువ కలిగిన బంగారు, వెండి ఆభరణాలు, నగదు అపహరణకు గురైంది. సీసీఎస్‌లో సంవ త్సరాల తరబడి పనిచేస్తున్న పోలీస్ అధికారులు, సిబ్బంది కారణంగా రికవరీ ఆశించిన స్థాయిలో జరగడం లేదు. గంజాయి అక్రమ రవాణా చేస్తున్న, విక్రయిస్తున్న వ్యాపారులపై 47 కేసులు నమోదు చేశారు. అలాగే 19 మహిళా కిడ్నాప్ కేసులు, 22 అత్యాచారం కేసులు, 91 వేధింపుల కేసులు నమోదయ్యాయి.
కమిషనరేట్ పరిధిలో జనవరి నుంచి
ఇప్పటి వరకు నమోదైన కేసుల వివరాలు
చైన్ స్నాచింగ్ : 5
చోరీలు : 36
గంజాయి
రవాణా
మహిళల
కిడ్నాప్
అత్యాచారం 22 వేధింపులు 91
కొత్త పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్‌సింగ్‌కు సమస్యల సవాళ్లు
వదలని గంజాయి మత్తు..
పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లు
భూపంచాయితీలకే
ప్రాధాన్యం
అడ్రస్ లేని పోలీసింగ్..?
ఎన్‌ఫోర్స్‌మెంట్‌పై
కసరత్తు కరువు
గంజాయి మత్తుతో కిక్కు..
వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధితోపాటు గ్రామాల్లోనూ గంజాయి మత్తు కిక్కు ఎక్కిస్తోంది. ట్రైసిటీ పరిధిలో అనేక హాస్టళ్లలో గంజాయి గుట్కాల మాదిరిగా సులువుగా లభిస్తున్నదని పోలీసులు గ్రహించినప్పటికీ అరికట్టడంలో విఫలమయ్యారు. ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు గంజాయి మత్తులో తరగతి గదుల్లో తన్నుకున్నారు. గ్రామాల్లో అనేక మంది యువకులు గంజాయి మత్తుకు బానిసలయ్యారు. గతంలో ఇక్కడ సీపీగా పనిచేసిన తరుణ్ జోషి గంజాయి అమ్మకాలపై దృష్టిసారించారు. గంజాయి సేవించే వారిపైనా కేసులు నమోదు చేశారు. ఓ స్వచ్ఛంద సంస్థ సహకారంతో గంజాయి బానిసైన సుమారు 100 మంది యువతను రిహాబిటేషన్ సెంటర్‌కు తరలించి వారిని తీర్చిదిద్దారు. ఆంధ్రప్రదేశ్, ఒడిశా రాష్ట్రాల నుంచి గంజాయి వరంగల్ మీదుగా మహారాష్ట్రకు తరులుతోంది. ఈ రవాణాను అరికట్టడంలో పోలీసులు విఫలమయ్యారనే విమర్శలు ఉన్నాయి.
పట్టపగలే చైన్ స్నాచింగ్‌లు..
కమిషనరేట్ పరిధి ట్రైసిటీలో పట్టపగలే చైన్‌స్నాచింగ్‌లు జరుగుతుండడంతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఈ ఏడాది మూడు నెలల్లో ఆరు చైన్‌స్నాచింగ్‌లు చోటుచేసుకోవ డం గమనార్హం. ఒక పక్క పోలీస్ అధికారులు బ్లూకోల్ట్ సిబ్బంది విజుబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్నారు. ఎక్కడ ఎలాంటి ఇబ్బందులు లేవని చెబుతున్నదానికి విరుద్ధంగా పట్టపగలే చోరీలు జరగడం గమనార్హం.
47
19
గబ్బర్‌సింగ్ కావాలి
గబ్బర్‌సింగ్ కావాలి